తమళ్ స్టార్ హీరో అజిత్ మాత్రం తన స్పీడును ఎక్కడా తగ్గించట్లేదు. రీసెంట్ గానే భారీ అంచనాల మధ్య వచ్చిన వలిమై సినిమా ఆ అంచనాలను అంతలా రీచ్ కాలేకపోయింది. అయితే అజిత్ మాత్రం జయాపజయాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ సినిమా రిలీజ్ అయిందో లేదో ఇప్పుడు వెంటనే మరో సినిమాను కూడా స్టార్ట్ చేసేశారు. అయితే ఈసారి కూడా మళ్లీ హెచ్. వినోద్ తోనే సినిమా చేయడం గమనార్హం. అజిత్ కు ఇదేమీ కొత్తకాదు. గతంలో తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వరుసగా నాలుగు సినిమాలు చేశాడు. నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్లుగా నిలిచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు హెచ్.వినోద్ కు ఆ అవకాశం దక్కింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో నెర్కొండ పార్వాయి, వలిమై సినిమాలు వచ్చాయి. హిందీలో వచ్చి సూపర్ హిట్ అయిన పింక్ సినిమాను తమిళ్ లో అజిత్ హీరోగా నెర్కొండ పార్వాయి గా బోనీ కపూర్ నిర్మించారు. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే వలిమై సినిమాను మొదలుపెట్టారు. వలిమై సినిమా షూటింగ్ దశలో ఉండగానే మూడో సినిమా కూడా చేస్తున్నట్టు తెలిపారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమాను నేడు సింపుల్ గా లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. అజిత్ కెరీర్ లో వస్తున్న 61వ సినిమా ఇది. అంతేకాదు వచ్చేవారం నుండి హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.
కాగా బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో రాబోయే ఈసినిమాలో అజిత్ నెగెటివ్ షేడ్ లో కనిపించనున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా మొదలయ్యాయి. ఈసినిమాను కూడా బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే హీరోయిన్.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. మరి ఈసినిమా అయినా మంచి సక్సెస్ ను అందిస్తుందేమో చూద్దాం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: