
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 185


డాల్బీ సినిమా టెక్నాలజీ తో "ఆర్ ఆర్ ఆర్"

కమల్ 'విక్రమ్' రిలీజ్ డేట్ ప్రకటనకు డేట్ ఫిక్స్..!

ప్రముఖ గేయ రచయిత 'కందికొండ' కన్నుమూత

అన్నయ్య చాలా కేరింగ్ అండ్ ప్రొటెక్టివ్..!

"#NBK 107"మూవీ సెట్స్ లో స్టార్ డైరెక్టర్

వెబ్ సిరీస్ "సిటాడెల్ "కై ట్రైనింగ్ లో సమంత

ఫుల్ యాక్షన్ ఫిలిం చేయాలని ఉంది..!

పూజాహెగ్డే క్యాజువల్ లుక్

'మైఖేల్' సినిమాలో వరుణ్ సందేశ్..!

స్పెయిన్ లో "ధమాకా"

టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అఖిల్ 'ఏజెంట్'

కమల్ 'విక్రమ్' రిలీజ్ డేట్ ఫిక్స్
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా విక్రమ్. ఈసినిమాలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి అలానే మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఫ్యాన్స్ తో పాటు అందరూ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది.

డాల్బీ సినిమా టెక్నాలజీ తో "ఆర్ ఆర్ ఆర్"
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

'ఆర్ఆర్ఆర్'.. సెలబ్రేషన్ ఆంథమ్ ప్రోమో రిలీజ్
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన సినిమా అవ్వడంతో ఈసినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ తో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈసినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాలి.. అందుకు తగ్గట్టే అప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేశారు. కానీ తెలిసిందే కదా.. అప్పుడు కరోనా థర్డ్ వేవ్ ప్రభావం వల్ల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే మార్చి 25న ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పుడు మళ్లీ ప్రమోషస్స్ షురూ చేస్తున్నారు.

కమల్ 'విక్రమ్' రిలీజ్ డేట్ ప్రకటనకు డేట్ ఫిక్స్..!
ఖైదీ, మాస్టర్ లాంటి హిట్ సినిమాలతో మంచి ఫామ్ లోకి వచ్చాడు లోకేష్ కనగరాజ్. ఇక ఇప్పుడు కమల్ హాసన్ తో సినిమా చేస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో విక్రమ్ అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమా ఎప్పుడో మొదలైంది. అయితే మధ్యలో కరోనా రావడం.. మధ్యలో కమల్ కూడా అనారోగ్యానికి గురవ్వడం ఇలా పలు కారణాలవల్ల ఈసినిమా షూటింగ్ కు అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

ప్రముఖ గేయ రచయిత 'కందికొండ' కన్నుమూత
సినిపరిశ్రమల్లో ఒకదాని తర్వాత ఒకటి విషాద పరిస్థితులు నెలకొంటున్నాయి. గత రెండెళ్లలో ఎప్పుడూ లేనివిధంగా సినీ పరిశ్రమ ఎంతో మందిని కోల్పోయింది. నటీనటులు, గాయకులు, రచయితలు ఇలా చాలామంది మృతి చెందారు. రీసెంట్ గా భారతరత్న గ్రహీత లతా మంగేష్కర్ కన్ను మూశారు. ఇక ఇటీవలే టాలీవుడ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి లెజెండరీ గేయ రచయితను కోల్పోగా.. ఇప్పుడు మరో గేయ రచయితను టాలీవుడ్ కోల్పోయింది. ఆయన కందికొండ యాదగిరి. గత కొంతకాలంగా వెన్నెముక సమస్య కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కందికొండ యాదగిరి. అయితే నేడు హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మృతికి పలువురు…

అన్నయ్య చాలా కేరింగ్ అండ్ ప్రొటెక్టివ్..!
రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా రాధే శ్యామ్. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. దాదాపు 300 కోట్ల బడ్జెత్ తో భారీ స్థాయిలో ఈసినిమాను నిర్మించారు. సినిమా చూసిన తరువాత ఖర్చుకు తగ్గ ఫలితం స్క్రీన్ పై కనిపిస్తుంది. అంత గ్రాండియర్ గా.. విజువల్ వండర్ గా.. ప్రతి ఫ్రేమ్ అర్టిస్టిక్ గా కనిపిస్తుంది. ఇక ఈసినిమా నిర్మాతల్లో ప్రభాస్ సోదరి, కృష్ణంరాజు కూతురు ప్రసీద కూడా ఒకరన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో ఈమె కూడా పాల్గొని తన…

"#NBK 107"మూవీ సెట్స్ లో స్టార్ డైరెక్టర్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

వెబ్ సిరీస్ "సిటాడెల్ "కై ట్రైనింగ్ లో సమంత
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. సమంత, నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “కాతు వాకుల రెండు కాదల్ “ తమిళ మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీలో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి ఒక హిందీ వెబ్ సిరీస్ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఫుల్ యాక్షన్ ఫిలిం చేయాలని ఉంది..!
ముకుంద సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే కి మొదట అన్నీ ఫ్లాప్సే పలకరించాయి. ఆతర్వాత దువ్వాడ జగన్నాథం సినిమాతో కాస్త ఫామ్ లోకి వచ్చి.. ఇటీవల వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఏ సినిమాలో అయినా ఫస్ట్ ఛాయిస్ గా పూజా హెగ్డే పేరునే సెలెక్ట్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు కొట్టేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఇక తాజాగా ప్రభాస్ తో నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

పూజాహెగ్డే క్యాజువల్ లుక్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజా హెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన“ఆచార్య “ఏప్రిల్ 29 , “బీస్ట్ ”( తమిళ ) మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

బాక్సాఫీస్ ను రూల్ చేస్తున్న 'రాధేశ్యామ్'
ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా నిన్న (మార్చి 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రేమకీ, విధికీ మధ్య సంఘర్షణ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై చివరి రోజుల్లో మంచి బజ్ నే క్రియేట్ చేశారు మేకర్స్. ఇక పాటలు, టీజర్, ట్రైలర్లు సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచేసింది. దీంతో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రభాస్ సినిమా కాబట్టి ఈసినిమాకు ముందే బుకింగ్స్ సాలిడ్ గా జరిగాయి.

"పుష్ప " స్పెషల్ సాంగ్ పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ”పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో చంద్ర బోస్ రచన ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్‌తో గానం చేసిన, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ లో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన "ఊ అంటావా.. ఊఊ అంటావా" స్పెషల్ సాంగ్ విమర్శలు ఎదుర్కొన్నా విడుదలైన 20 రోజుల్లోనే అన్ని భాషలలో 100ప్లస్ మిలియన్ వ్యూస్‌ని సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.

"భవదీయుడు భగత్ సింగ్" మూవీ లో ప్రొఫెసర్ గా పవన్ కళ్యాణ్?
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూ పొందిన యాక్షన్ కామెడీ “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా "గబ్బర్ సింగ్ " మూవీ ని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు. మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనుంది.

'మైఖేల్' సినిమాలో వరుణ్ సందేశ్..!
టాలీవుడ్ లో యంగ్ హీరోల జోరుగా మాములుగా లేదు. ఒక్కొక్కరూ కనీసం రెండు మూడు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటున్నారు. ఇక ఆ లిస్ట్ లో యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా వస్తాడు. యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. రీసెంట్ గానే గల్లీరౌడీ లాంటి కామెడీ ఎంటర్ టైనర్ తో అలరించిన సందీప్ కిషన్ ప్రస్తుతం మైఖేల్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ దశలో ఉండగా.. త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసి రిలీజ్ చేయాలన్న ప్లాన్ చేస్తున్నారు.

ఓటీటీలోకి వచ్చేసిన 'ఖిలాడి'
కరోనా ముందు సినిమా రిలీజ్ అయిన తరువాత ఓటీటీ లోకి రావాలంటే చాలా టైమ్ పట్టేది. కానీ కరోనా వల్ల పరిస్థితులు చాలా మారిపోయాయి. సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఓటీటీలో దర్శనమిచ్చేస్తున్నాయి. చిన్న సినిమాలే కాదు పెద్ద సినిమాలు కూడా అదే బాట పడుతున్నాయి. అఖండ, పుష్ప లాంటి సినిమాలు బాక్సాఫీస్ బద్దలుకొట్టినా చాలా తక్కువ రోజులకే ఓటీటీలోకి వచ్చేశాయి. వీటితో పాటు చాలా సినిమాలు ఓటీటీలో సందడి చేస్తుండగా ఇప్పుడు రవితేజ ఖిలాడి కూడా చేరిపోయింది. ఈసినిమా కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

స్పెయిన్ లో "ధమాకా"
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ”ధమాకా ” శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. “#RT 69 ” షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ”ధమాకా ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ
దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన "బాహుబలి", "బాహుబలి 2 " మూవీస్ ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళ తో రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ మూవీస్ తో పాన్ ఇండియా మూవీస్ ప్రారంభం అయ్యాయి. ప్రభాస్ హీరోగా రూపొందిన "సాహో", "రాధేశ్యామ్ " మూవీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కి పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయ్యాయి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “, టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ”, వైజయంతీ మూవీస్ బ్యానర్ పై…

ఉపేంద్ర కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్..!
డిఫరెంట్ సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేయడంలో కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర కే సాధ్యం. తను చేసే సినిమాలు అన్నీ దాదాపు విభిన్నంగానే ఉంటాయి. ఇప్పటికే కబ్జా సినిమాతో వస్తున్నాడుఉపేంద్ర. 1970బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాలో సుదీప్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అఖిల్ 'ఏజెంట్'
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా 'ఏజెంట్'. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో అఖిల్ పూర్తిగా తన లుక్ మార్చేశాడు.. సిక్స్ ప్యాక్ బాడీతో ఆకట్టుకోనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకూ పూర్తయింది. నిజానికి ఎప్పుడో ఈసినిమా షూటింగ్ పూర్తవ్వాలి కానీ.. కరోనా వల్ల ఈసినిమా షూట్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇక ఈసినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. రీసెంట్ గానే ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

రిలీజ్ కు ముందే రికార్డ్ లు.. 1 మిలియన్ క్లబ్ లో 'ఆర్ఆర్ఆర్'
ఒక సినిమా రిలీజ్ అయిన తరువాత రికార్డులు క్రియేట్ చేయడం కామనే. కానీ రిలీజ్ కు ఇంకా రెండు వారాలు ఉండగానే అప్పుడే రికార్డులు మొదలుపెట్టింది ఒక సినిమా. ఆ సినిమా మరేదో కాదు ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమాను భారీగానే ప్రమోషన్ చేశారు రాజమౌళి. నార్త్, సౌత్ లో కూడా అన్ని ప్రెస్ మీట్లలో యాక్టివ్ గా పాల్గొన్నారు ఎన్టీఆర్, చరణ్ కూడా. రిలీజ్ డేట్ వాయిదా పడటంతో కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు కాబట్టి మళ్లీ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు.