యంగ్ హీరో నాగచైతన్య వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లోనే ఉన్నాడు. గత ఏడాది లవ్ స్టోరీతో హిట్ కొట్టిన నాగ చైతన్య రీసెంట్ గా బంగార్రాజు సినిమాతో మరో హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు తన తరువాత ప్రాజెక్ట్ ను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సినిమాలతో పాటు నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు నాగ చైతన్య. ఈ వెబ్ సిరీస్ దూత అనే టైటిల్ తో తెరకెక్కబోతుంది. రీసెంట్ గానే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలిపారు. ఇక ప్రస్తుతం అయితే షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమాలో నటిస్తున్న ఫీమేల్ లీడ్ కు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు. నేడు మేకర్స్ ఒక ఫొటోను పోస్ట్ చేయగా అందులో నాగ చైతన్య, మలయాళం యాక్ట్రెస్ పార్వతీ ఇంకా ప్రియా భాస్కర్ కూడా ఉంది.
కాగా ఇది హారర్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా ఉండబోతుంది. అమెజాన్ ప్రైమ్ నిర్మాణంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ఇక చైతూ మొదటిసారి హారర్ జోనర్ లో చేస్తుండటంతో దీనిపై అంచనాలు పెరిగాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: