దర్శకధీరుడు రాజమౌళి గురించి మేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటివరకూ విజయం తప్పా పరాజయం ఎరుగని డైరెక్టర్. అంతేకాదు సినిమా సినిమాకు తన టేకింగ్ లో కొత్త దనం చూపిస్తూ వస్తూనే ఉన్నాడు. అందుకే బాహుబలి లాంటి సినిమాను తీసి తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. రాజమౌళి నుండి సినిమా వస్తుందంటే అది తప్పకుండా రికార్డలు చేస్తుంది అనే నమ్మకం ఉండటమే కాదు.. చాలామందికి రాజమౌళి సినిమాలో నటించాలన్న కోరక కూడా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇంతవరకూ ఫెయిల్యూర్ అంటేనే తెలియని రాజమౌళికి కూడా ఫెయిల్యూర్ భయం ఉంటుంది అంటున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈసినిమా కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఒక్క సినిమా కోసమే ఎన్టీఆర్, చరణ్ దాదాపు మూడేళ్లు మరొక సినిమాకు కమిట్ కూడా అవ్వలేదు. అందుకే అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు చరణ్ ఫ్యాన్స్ కూడా మరింత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎన్నో వాయిదాల అనంతరం మార్చి 25న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం మళ్లీ ఫ్రెష్ గా ప్రమోషన్ మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు రాజమౌళి. ఇక ఇంటర్వ్యూలో ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతూ.. ఫెయిల్యూర్ భయమే నాలో పెద్ద కలలు కనేలా చేస్తుంది.. నేను ఎప్పుడు ఏ సినిమా చేసినా అది నా ముందు సినిమా అంచనాలను మించి ఉండాలి. అందుకే, మ్యాజిక్‌ను సృష్టించాలనే భయం నాకు చాలా ఉంది.. ఆ భయమే నన్ను బెటర్ గా చేసేలా చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.
కాగా ఈసినిమాలో చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: