కన్నడ , తెలుగు చిత్ర పరిశ్రమలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక ” సుల్తాన్ “మూవీ తో తమిళ ప్రేక్షకులను అలరించారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రష్మిక “మిషన్ మజ్ను “, “గుడ్ బై ” బాలీవుడ్ మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక బాలీవుడ్ ఫస్ట్ స్ట్రయిట్ మూవీ “మిషన్ మజ్ను “రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్ ఎస్ వి పి బ్యానర్ పై శంతను బాగ్చి దర్శకత్వంలో సిద్ధార్ధ్ మల్హోత్రా,రష్మిక జంటగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను” మూవీ జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. అయితే బ్లాక్ బస్టర్ “పుష్ప:ది రైజ్”హిందీ డబ్బింగ్ వెర్షన్ తో రష్మిక బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. ఆ మూవీ లో శ్రీవల్లి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రష్మిక బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని గుర్తింపు పొందారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































