‘చిరు’ స్పూర్తితో చిరుతను పెంచుకుంటున్న డాక్టర్.. వాటికోసం ఉక్రెయిన్ లోనే..!

Chiranjeevi Appreciates A Telugu Doctor In Ukraine,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Russo-Ukrainian War,Telugu Doctor in Ukraine,Mega star Chiranjeevi,Megastar Chiranjeevi Appreciates telugu Doctor,#TeluguDoctor,#UkraineWar,Telugu Doctor In Ukraian, Telugu Doctor with Jaguar,Telugu doctor Kumar from india having pets Jaguar,Megastar Chiranjeevi Movies,Chiranjeevi Upcoming Movies,Chiranjeevi latest Movie updates, Chiranjeevi New Movies,#Jaguar,#Panther,#compassion,#petlovers

గత కొద్దిరోజులుగా రష్యా-ఉక్రెయిన్ దేశాలమధ్య భీకరయుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్దంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అక్కడ భారతీయులు కూడా ఎంతో మంది జీవనం సాగిస్తుండగా.. ఇప్పటికే వేలాది మందిని కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకొస్తోంది. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. అక్కడ ఉన్న ఓ తెలుగు యువకుడు మాత్రం ఇక్కడికి వచ్చేది లేదు అంటున్నాడు. దానికి కారణం తను పెంచుకుంటున్న చిరుతి, జాగ్వర్ లే కారణం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆంధ్రప్రదేశ్ లోని తణుకుకు చెందిన కుమార్.. ఉక్రెయిన్ లో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. యూట్యూబ్ లో జ్వాగ్వార్ కుమార్ గా అందరికీ పరిచయమే. డాక్టర్ గా అక్కడే సెటిల్ అయిన కుమార్ యూట్యూబ్ వీడియోలు చేస్తూ అక్కడి విశేషాలను అందిస్తుంటాడు. అలాగే అతడికి పులులంటే కూడా అమితమైన ఇష్టం. లంకేశ్వరుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చిరుతను పెంచుకోవడం చూసిన కుమార్.. తాను కూడా పులిని పెంచుకోవాలని భావించాడు. అంతేకాదు అక్కడి ప్రభుత్వం అనుమతి తీసుకొని పులి పిల్లను తెచ్చుకొని పెంచుకున్నాడు. గత 19 నెలలుగా వాటిని జాగ్రత్తగా పెంచుకంటూ వస్తున్నాడు కుమార్. దీంతో ప్రస్తుతం ఉక్రెయిన్ లో యుద్దం జరుగుతున్నా వాటిని విడిచి రావడానికి నిరాకరిస్తున్నాడు.

ఇక దీంతో దీనిపై పలు కథనాలు రాగా.. తాజాగా దీనిపై చిరు కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రియమైన గిరి కుమార్‌.. నా నుంచి ప్రేరణ పొంది.. జాగ్వార్స్, పాంథర్‌ లను పెంచుకుంటున్నారని తెలిసి చాలా సంతోషిస్తున్నాను. ఈ దురదృష్టకర యుద్ధ సమయంలో కూడా మీ పెంపుడు జంతువులపై మమకారంతో ఉక్రెయిన్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ మూగజీవాలపై మీకున్న మమకారం ప్రశంసనీయం. ఈ క్లిష్ట సమయంలో మీరు అక్కడ భద్రంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. త్వరలో యుద్ధం ముగిసి సాధారణ స్థితికి చేరుకోవాలని కోరుకుంటున్నారు. గాడ్ బ్లెస్!..’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.