‘లాలా’ పుట్టినరోజు.. మిగిలింది హిస్టరీ

Thaman S Reveals Facts about Lala Bheemla Song,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Thaman S,Thaman S Music director,Thaman S Music Composer for Radhe Shyam,Thaman S BGM For Bheemla Nayak,Thaman Upcoming Movies,Thaman Latest Super hit Movies,Thaman Super Hit songs, Thaman S About Bheemla nayak Songs,Thaman S About Bheemla Song,Thaman S Reveals Fact About Bheemla Song,Saagar k Chandra Movie Bheemla Nayak,The Birth of LaLa in Bheemla Nayak Song, Pawan Kalyan Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak Movie,Trivikram,Saagar K Chandra,Nithya Menen,Thaman S,Samyuktha,Bheemla Nayak Songs, Bheemla Nayak Movie Songs,Sitara Entertainments,Naga Vamsi,Bheemla Nayak Trailer Launch,Bheemla Nayak Theatrical Trailer,Bheemla Nayak Hindi Movie Trailer, Bheemla Nayak Hindi Movie,Bheemla Nayak Hindi,Bheemla Nayak Official Hindi Trailer,#BheemlaNayakHindi,#BheemlaNayak,#ranadaggubati,#LALA,#lalabheemla

సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మల్టీస్టారర్ భీమ్లానాయక్. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు కదా. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా సాలిడ్ కలెక్షన్స్ కొల్లగొడుతూ దూసుకుపోతుంది. ఇక ఈసినిమా పాటలు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విజయంలో పాటలు కూడా కీలక పాత్ర పోషించాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పాటలు రిలీజ్ చేసిన దగ్గర నుండి రికార్డు స్థాయిలో మారు మ్రోగుతూనే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా రిలీజ్ అయి ఇప్పటికే చాలా కాలం అవుతున్నా ఈసినిమాకు మ్యూజిక్ అందించిన థమన్ మాత్రం ఇంకా ఈ సినిమా పాటల గురించి గుర్తుచేసుకుంటూనే ఉన్నాడు. ఇక తాజాగా తన ట్విట్టర్ ద్వారా ఈసినిమాలోని లాలా భీమ్లా నాయక్ కు సంబంధించిన మెమరీస్ ను గుర్తు చేసుకున్నాడు. థమన్ ఒక ఫొటో పోస్ట్ చేస్తూ.. లాలా పుట్టిన రోజు ఆరోజు.. మిగిలినదంతా చరిత్ర అని పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇక ఈఫొటో లో త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, థమన్ లు ఉన్నారు.

కాగా పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాకి జంటగా సంయుక్త మీనన్ నటించగా.. సముద్రఖని, మురళీశర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 14 =