
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 179


లారెన్స్ "రుద్రన్" మూవీ ప్రీ లుక్ రిలీజ్

చిరంజీవి అద్భుతమైన స్నేహితుడు - ఖుష్బూ

బాలీవుడ్ లో బిజీగా సమంత

"భీమ్లా నాయక్ " టీమ్ కు అల్లు అర్జున్ అభినందనలు

'కరణ్ జోహార్' చేతిలో మలయాళం హిట్ మూవీ హక్కులు

మాస్ థియేటర్ లో ఎంజాయ్ చేస్తున్న ఉపాసన

"ఆర్ ఆర్ ఆర్ " మూవీ పై ఎన్టీఆర్ స్పందన

'గాడ్ ఫాదర్' షూటింగ్ పూర్తి చేసుకున్న సల్మాన్..!

రామ్ గోపాల్ వర్మ-ఉపేంద్ర సినిమా టైటిల్ ఫిక్స్

"RRR"తో మరో "R"

ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్

'కార్తికేయ2' షూటింగ్ అప్ డేట్..!

తమిళ్ డైరెక్టర్ తో 'చైతు' సినిమా ఫిక్స్..!

ఏప్రిల్ నుండి సెట్స్ కు పవన్ కళ్యాణ్

ఆర్ఆర్ఆర్ పై చిరు రియాక్షన్.. హ్యాట్సాఫ్ టీమ్..!
ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఎక్కడా చూసినా ఈసినిమా గురించే వినిపిస్తుంది. ఎంతో కాలం నిరీక్షణ తరువాత.. ఎన్నో అంచనాల మధ్య ఆర్ఆర్ఆర్ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేసిన ఈసినిమా సినిమా రిలీజ్ తరువాత బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రాజమౌళి టేకింగ్, ఎన్టీఆర్-చరణ్ ల పెర్ఫామెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇక నుండి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు అని చెప్పాల్సి వస్తుందని అంటున్నారు.

లారెన్స్ "రుద్రన్" మూవీ ప్రీ లుక్ రిలీజ్
డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించి కొరియోగ్రాఫర్ గా పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన రాఘవ లారెన్స్ హీరోగా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దర్శకుడిగా మారి లారెన్స్ పలు సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించారు. హారర్ , కామెడీ మూవీస్ కు లారెన్స్ పెట్టింది పేరుగా మారారు. దర్శకుడిగా తాత్కాలికంగా విరామం ఇచ్చి లారెన్స్ యాక్టింగ్ పై ఫోకస్ పెట్టారు. లారెన్స్ ప్రస్తుతం "రుద్రన్ ", "అధికారం "మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

చిరంజీవి అద్భుతమైన స్నేహితుడు - ఖుష్బూ
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఖుష్బూ, మెగా స్టార్ చిరంజీవి మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా తెరకెక్కిన "స్టాలిన్ "మూవీ లో ఖుష్బూ ఓ కీలక పాత్రలో నటించారు. అదేవిధంగా ఏటా 80ల బ్యాచ్ అంటూ నిర్వహించే గెట్ టు గెదర్ ఫంక్షన్‌లో వీరు సందడి చేస్తూ ఉంటారు. తాజాగా సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ, చిరంజీవి ని కలిశారు. హైదరాబాద్‌లో మెగాస్టార్ ఇంటికెళ్లిన ఆమె కొద్దిసేపు ఆయనతో మాట్లాడారు.

'జానీ మాస్టర్' కు 'సుదీప్' సర్ ప్రైజింగ్ గిఫ్ట్..!
తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు నోటెడ్ అయిన జానీ మాస్టర్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఇక్కడ చిరంజీవి సహా ఎంతో మంది స్టార్ హీరోలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన జానీ మాస్టర్ ఇప్పుడు తమిళ్ లో కూడా బిజీ అయిపోయారు. రీసెంట్ గా బీస్ట్ సినిమానుండి వచ్చిన అరబిక్ కుతు పాట ఎంత రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో చూశాం. ఈపాటకు జానీ మాస్టరే కొరియోగ్రఫి చేశారు. ఇంకా విజయ్ తో పాటు తమిళ్ లో చాలా మంది స్టార్ హీరోలకు కూడా పనిచేస్తున్నాడు.

బాలీవుడ్ లో బిజీగా సమంత
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. సమంత, నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “కాతు వాకుల రెండు కాదల్ “ తమిళ మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీలో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి ఒక హిందీ వెబ్ సిరీస్ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"భీమ్లా నాయక్ " టీమ్ కు అల్లు అర్జున్ అభినందనలు
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్, విశేష ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించిన .“భీమ్లా నాయక్ ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను అలరించారు.

'కరణ్ జోహార్' చేతిలో మలయాళం హిట్ మూవీ హక్కులు
మలయాళం సినిమాలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఎర్పడిందని చెప్పొచ్చు. పెద్ద హడావుడి లేకుండానే.. మంచి కథలతో మలయాళం సినిమాలు ఇప్పుడు చాలా హిట్లను సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పటికే మన తెలుగులో చాలా మలయాళం సినిమాలు రీమేక్ అవుతున్నాయి. ఇటీవల పవన్-రానా కాంబినేషన్ లో వచ్చిన భీమ్లా నాయక్ సినిమా కూడా మలయాళం రీమేకే. మరి ఈసినిమా ఎంత సంచలనం సృష్టించిందో చూశాం. ఇక ఇటీవలే మరో హిట్ మూవీకి మంచి క్రేజ్ ఏర్పడింది.

ఆడియన్స్ కు 'సితార' థ్యాంక్స్..!
ఈమధ్య పాటలతోనే సినిమాపై మంచి క్రేజ్ ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. మరీ ముఖ్యంగా థమన్ అయితే తన పాటలతోనే సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ చేసేస్తున్నాడు. అల వైకుంఠపురం నుండి మొదలైన థమన్ హవా ఉంకా నడుస్తూనే ఉంది. రీసెంట్ గా భీమ్లానాయక్ సినిమా పాటలు ఏ రేంజ్ లో జనాల్లోకి ఎక్కాయో చూశాం. ఇక ఇప్పుడు థమన్ సంగీతం అందిస్తున్న సర్కారు వారి పాట సినిమా పాటలు కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది.. ఈసినిమా నుండి మొదట రిలీజ్ అయిన కళావతి పాట ఇప్పటికే 100 మిలియన్ కోట్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.

'కె.జి.యఫ్ 2' కోసం స్టార్ హీరో, స్టార్ ప్రొడ్యూసర్..!
దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూసే పాన్ ఇండియా సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమా కూడా రిలీజ్ అయిపోయి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. ఈసినిమా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. వీటితో పాటు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో కె.జి.యఫ్ 2 కూడా ఒకటి. ఈసినిమా కూడా ఏప్రిల్ 14 భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈసినిమాపై కూడా ఏ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే.

దేశవ్యాప్తంగా "ఆర్ ఆర్ ఆర్"మూవీ కి అద్భుత రెస్పాన్స్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ ఈ రోజు (మార్చి 25 వ తేదీ) ప్రపంచవ్యాప్తంగా 10, 000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ మూవీ లో ఉత్తమమైన నటనను కనబరిచారు. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో హీరోలిద్దరూ తమ మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.

మాస్ థియేటర్ లో ఎంజాయ్ చేస్తున్న ఉపాసన
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందించారు.

"ఆర్ ఆర్ ఆర్ " మూవీ పై ఎన్టీఆర్ స్పందన
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ ఈ రోజు (మార్చి 25 వ తేదీ) ప్రపంచవ్యాప్తంగా 10000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కై 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రేక్షక , అభిమానులు "ఆర్ ఆర్ ఆర్ "మూవీ కి బ్రహ్మరధం పడుతున్నారు.

'గాడ్ ఫాదర్' షూటింగ్ పూర్తి చేసుకున్న సల్మాన్..!
మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ ను తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ తో మోహన్ రాజా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.

రామ్ గోపాల్ వర్మ-ఉపేంద్ర సినిమా టైటిల్ ఫిక్స్
రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా కాస్త రియాలిటి కథలను తీయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇక కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సినిమాలు కూడా ఎంత డిఫరెంట్ గా ఉంటాయో తెలుసు. తను చేసే సినిమాలు, పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా. రామ్ గోపాల్ వర్మ-ఉపేంద్ర కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే అప్పటి నుండి దీనిపై పెద్దగా ఎలాంటి అప్ డేట్ లేదు. దాదాపు ఈసినిమా గురించి కూడా అందరూ మరిచిపోయారు.

"RRR"తో మరో "R"
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందించారు.

ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జూన్ 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సామ్ సి ఎస్ సంగీతం అందించారు.

'కార్తికేయ2' షూటింగ్ అప్ డేట్..!
యంగ్ హీరో నిఖిల్ నుండి సినిమా వచ్చి కూడా చాలా రోజులవుతుంది. అయితే తను ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టి ఆ సినిమాల షూటింగ్స్ పనిలో బిజీగా ఉన్నాడు. ఇక నిఖిల్ కార్తికేయ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తుంది. కార్తికేయ సినిమా నిఖిల్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది. దీంతో ఈ సీక్వెల్ పై కూడా మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ఎప్పుడో మొదలైన కూడా ఈసినిమాకు కరోనా వల్ల చాలా బ్రేకులే పడ్డాయి. దీంతో ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా చాలా లేట్ అయింది.

ఎన్టీఆర్ కంప్లీట్ యాక్టర్ - సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్
"ఐతే "(2003 ) మూవీ తో సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన కె కె సెంథిల్ కుమార్ , రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "సై"మూవీకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. రాజమౌళి , సెంథిల్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన "ఛత్రపతి ", "యమదొంగ ", "మగధీర ", "ఈగ ", "బాహుబలి ", బాహుబలి 2 " మూవీస్ ఘనవిజయం సాధించాయి. తాజాగా "రౌద్రం రణం రుధిరం "మూవీ తెరకెక్కింది. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ "మగధీర ", "బాహుబలి" , "బాహుబలి 2 " మూవీస్ కు ఫిల్మ్ ఫేర్ , "ఈగ", "బాహుబలి" మూవీస్ కు నంది అవార్డ్స్ అందుకున్నారు.

తమిళ్ డైరెక్టర్ తో 'చైతు' సినిమా ఫిక్స్..!
నాగచైతన్య మాత్రం చాలా జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒకపక్క వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇక మరోపక్క సినిమాలను చేస్తూనే మరోపక్క డిజిటల్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు. ఇప్పటికే నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమా వస్తుంది ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇది రిలీజ్ కాకముందే విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈసిరీస్ కూడా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇంకా వీటితో పాటు తెలుగులో పలు యంగ్ డైరెక్టర్లను కూడా నాగచైతన్య లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.

ఏప్రిల్ నుండి సెట్స్ కు పవన్ కళ్యాణ్
బ్లాక్ బస్టర్ “భీమ్లా నాయక్” మూవీ లో తన పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ పార్టీ (జనసేన) కార్యకలాపాలతో బిజీ అయిపోయారు.ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్తారని సమాచారం. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.