
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 180


'ఆర్ఆర్ఆర్' టీమ్ కు కోన వెంకట్ బెస్ట్ విషెస్

సీక్వెల్ మూవీ పై ఎన్టీఆర్ కామెంట్

"జెంటిల్ మెన్ 2 "మూవీ లో హీరోయిన్ బేబీ నయనతార

యాక్షన్ సీన్స్ హైలైట్ గా "ఆర్ ఆర్ ఆర్"

కీర్తి సురేష్ 'సాని కాయిదం' రిలీజ్ డేట్ ఫిక్స్..?

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో 'ఆర్ఆర్ఆర్' టీమ్..!

లేడీ గెటప్ లో విలక్షణ నటుడు 'ఉపేంద్ర'

ఫ్యాన్స్ కు 'కె.జి.యఫ్ 2' మేకర్స్ బంపరాఫర్

కెరీర్ లో గేమ్ ఛేంజర్ మూవీ "బాహుబలి"- ప్రభాస్

రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్ లో భారీ మూవీ

పరాజయాలే విజయాలకు తొలి మెట్టు - పూజా హెగ్డే
"ముగమూడి "తమిళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన పూజా హెగ్డే కు ఆ మూవీ నిరాశపరిచింది. హీరో నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో పూజా హెగ్డే టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన "ముకుంద ", "సాక్ష్యం ", బాలీవుడ్ ఎంట్రీ మూవీ "మెహంజా దారో "పరాజయం పాలయ్యాయి. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటించిన“ఆచార్య “ఏప్రిల్ 29 , “బీస్ట్ ”( తమిళ ) మూవీ ఏప్రిల్…

'ఆర్ఆర్ఆర్' టీమ్ కు కోన వెంకట్ బెస్ట్ విషెస్
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా రాజమౌళి ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈసినిమా రిలీజ్ కు మరికొద్దిగంటలు మాత్రమే టైముంది. ఇక ఈసినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారు మాత్రమే కాదు ఈసినిమా కోసం సినీ సెలబ్రిటీలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'వలిమై' కలెక్షన్స్ పై మేకర్స్ క్లారిటీ
హెచ్. వినోత్ దర్శకత్వంలో అజిత్ హీరోగా వచ్చిన సినిమా ‘వలిమై’. ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా మంచి టాక్ నుసొంతం చేసుకుంది. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటాడు. తొలి మూడు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది భారీ బిజినెస్ మరియు భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈసినిమా కలెక్షన్స్ పై పలు వార్తలు వస్తున్నాయి. ఈసినిమా కలెక్షన్స్ అనుకున్నంత రాలేదన్న వార్తలు రావడంతో దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. 2022 లో అజిత్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అని…

సీక్వెల్ మూవీ పై ఎన్టీఆర్ కామెంట్
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం తో తెరకెక్కిన యాక్షన్ కామెడీ "అదుర్స్ "మూవీ ఘనవిజయం సాధించింది. నయనతార , షీలా కథానాయికలు. బ్రహ్మానందం , ఎమ్ ఎస్ నారాయణ , మహేష్ మంజ్రేకర్ , ఆశిష్ విద్యార్థి , రఘు బాబు ముఖ్య పాత్రలలో నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. హీరో ఎన్టీఆర్ చారి , నరసింహా క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా చారి క్యారెక్టర్ లో ఎన్టీఆర్ కామెడీ ని అద్భుతంగా పండించారు. ఎన్టీఆర్ - బ్రహ్మానందం , బ్రహ్మానందం - ఎమ్ ఎస్ నారాయణ కాంబినేషన్ సీన్స్ నవ్వులు పూయించాయి. ప్రతీ క్యారెక్టర్ కు కామెడీ టచ్…

'యశోద' సమంత యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక దశాబ్దం పైగా ఏలింది సమంత. ఇక ఇప్పుడు కాస్త తన రూట్ ను మార్చి సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే పాత్రలను ఎంచుకునే సమంత ఇప్పుడు దాదాపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ప్రస్తుతం తను అటు తెలుగులో చేస్తూనే మరోపక్క తమిళ్, అలానే హిందీలో కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ఇక తెలుగులో శాకుంతలం, యశోద సినిమాలు చేస్తుంది. వీటిలో శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుండగా.. యశోద సినిమా షూటింగ్ దశలో ఉంది.

"జెంటిల్ మెన్ 2 "మూవీ లో హీరోయిన్ బేబీ నయనతార
ఏ ఆర్ ఎస్ ఫిల్మ్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై కె. టి. కుంజుమోన్ నిర్మాతగా శంకర్ ఎస్ దర్శకత్వంలో అర్జున్ , మధుబాల జంటగా తెరకెక్కిన “జెంటిల్ మేన్ “తమిళ మూవీ 1993 సంవత్సరంలో జూలై 30 వ తేదీ రిలీజ్ అయ్యి కమర్షియల్ గా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో శంకర్ దర్శకుడిగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఏ ఆర్ రెహమాన్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.“జెంటిల్ మేన్ “తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విజయం సాధించింది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ లో రీమేక్ అయ్యింది.

'మాచర్ల నియోజకవర్గం' నితిన్ ఫస్ట్ లుక్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!
గతేడాది‘మాస్ట్రో’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. అయితే ఆ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయగా మంచి విజయం దక్కింది. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా మాచర్ల నియాజకవర్గం. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక నితిన్ కూడా తన కెరీర్ లో ఇలాంటి పాత్రలో మొదటిసారి వస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. ఇక మరోవైపు చిత్రయూనిట్ చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది.

యాక్షన్ సీన్స్ హైలైట్ గా "ఆర్ ఆర్ ఆర్"
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందించారు.

కీర్తి సురేష్ 'సాని కాయిదం' రిలీజ్ డేట్ ఫిక్స్..?
ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది కీర్తి సురేష్. ఒకపక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క తమిళంలో కూడా వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఈనేపథ్యంలోనే కీర్తీ సురేష్, దర్శకుడు సెల్వ రాఘవన్ నటీనటులుగా తమిళ్ లో ‘సాని కాయిదం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడు ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 7న ఈసినిమాకు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై త్వరలో అధికారిక ప్రకటన ఇస్తారేమో చూడాలి.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో 'ఆర్ఆర్ఆర్' టీమ్..!
రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈసినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. స్వతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించాడు రాజమౌళి. ఇక ఈసినిమా ఈనెల 25న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు టీమ్. ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ టీమ్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ లో పాల్గొంటూ పలు ప్రాంతాలు పర్యటిస్తున్నారు. ఇక ఈసినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో తెలియాలంటే ఇంకా రెండు రోజులు ఆగాల్సిందే.

నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' నుండి రానున్న క్రేజీ అప్ డేట్
గత కొంతకాలంగా డిఫరెంట్ పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు నితిన్. కమర్షియల్ చేస్తూనే వాటిలో కాస్త డిఫరెంట్ ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక ఈనేపథ్యంలో నితిన్ తాజాగా చేస్తున్న సినిమా మాచర్ల నియోజక వర్గం. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. పొలిటికల్ ఎలిమెంట్స్ తో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రేపు అంటే మార్చి 24న ఉదయం 10…

'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్.. కామెడీ టైమింగ్ తో అదరగొడుతున్న 'ఎన్టీఆర్'
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. 1920లో సాగే ఈ చిత్రం సుమారు రూ. 400 కోట్లతో రూపొందింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకున్నాయి. ఇక ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ పై చూపించబోతున్నాడు రాజమౌళి. ఇక వీరిద్దరినీ ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా ఈసినిమా మార్చి 25న రిలీజ్ కాబోతుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురూ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ లో పాల్గొంటూ…

పోల్ గేమ్ :విజయ్ "బీస్ట్" Vs యష్ "కె జి ఎఫ్ 2" ఏ మూవీకి మీ ఓటు ?
సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన “బీస్ట్ “తమిళ మూవీ ఏప్రిల్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. స్టార్ హీరో విజయ్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ రిలీజైన 23 రోజుల్లోనే 150 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని , సౌత్ ఇండియాలోనే అత్యంత వేగంగా భారీ వ్యూస్ సాధించిన సాంగ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.“బీస్ట్ “మూవీ లో స్టార్ హీరో విజయ్ గానం చేసిన సెకండ్ సింగిల్ "జాలీ ఓ జింఖానా "రిలీజ్ అయిన15 నిమిషాలలో…

లేడీ గెటప్ లో విలక్షణ నటుడు 'ఉపేంద్ర'
విభిన్నమైన సినిమాలతో.. డిఫరెంట్ రోల్స్ తో ఆడియన్స్ ను ఎప్పుడూ సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటాడు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర. ఇక ఇప్పుడు కూడా అలాంటి డిఫరెంట్ సినిమాలతోనే ప్రేక్షకులను అలరించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలో తను తాజాగా తన ట్విట్టర్ ద్వారా ఒక ఫొటో షేర్ చేయగా మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు ఉపేంద్ర. ఒక అమ్మాయి ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్డడమే కాదు ఆ ఫొటో ను షేర్ చేశారు. ఆ ఫొటోలో ఉన్నది ఎవరో కాదు ఉపేంద్రనే. ఆయన లేడీ గెటప్ ధరించి ఆ ఫొటో దిగారని స్పష్టమవుతోంది. తన సినిమాలో ఓ పాత్ర కోసం ఇలా లేడీ గెటప్ వేసి ఉంటారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతుంది.

ఐటెమ్ సాంగ్ చేయడం అదే ఫస్ట్ & లాస్ట్ - రెజీనా
“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రెజీనా ప్రస్తుతం “పార్టీ”,”కళ్ళపార్టు “, “కాసాడ తపరా”(తమిళ ), తెలుగు , తమిళ భాషల “శూర్పాంగనై” , తెలుగు , తమిళ భాషల“శాకినీ ఢాకినీ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “రాకెట్ బాయ్స్” హిందీ వెబ్ సిరీస్ లో నటించిన రెజీనా ప్రస్తుతం షాహిద్ కపూర్ , విజయ్ సేతుపతి నటిస్తున్న హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాలకు అతిథి గా చిరంజీవి
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆచార్య “మూవీ ఏప్రిల్29 వ తేదీ రిలీజ్ కానుంది.మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఒకే సారి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ఫ్యాన్స్ కు 'కె.జి.యఫ్ 2' మేకర్స్ బంపరాఫర్
ప్రశాంత్ నీల్‌దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ కె.జి.యఫ్ 2. ఈసినిమా 2018లో విడుదలైన కె.జి.యఫ్ 1 కు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్ 14న మూవీ రిలీజ్ అవుతుంది. ఇక ఇన్ని రోజులు కాస్త సైలెంట్ గా ఉన్న ఈసినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేయనుంది. ఈనేపథ్యంలో తమ ప్రమోషన్స్ లో ఫ్యాన్స్ ను కూడా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నారు.

కెరీర్ లో గేమ్ ఛేంజర్ మూవీ "బాహుబలి"- ప్రభాస్
ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలలో 2 భాగాలుగా రూపొందిన “బాహుబలి ” మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ తో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ను చాటిచెప్పారు. భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందిన “బాహుబలి “హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచి హీరో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు నిచ్చింది. బ్లాక్ బస్టర్ "బాహుబలి "మూవీ తో టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ ప్రారంభం కావడం , ప్రభాస్ నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం.

రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్ లో భారీ మూవీ
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన "రౌద్రం రణం రుధిరం "మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 25 వ తేదీ భారీ ఎత్తున రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం "ఆర్ ఆర్ ఆర్ "మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తరువాత రాజమౌళి , సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనుంది.

'రాజమౌళి' తో 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ ఇంటర్వ్యూ..!
బాహుబలి సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకధీరుడు రాజమౌళి. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో సంచలనానికి సిద్దమవుతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా అవ్వడం అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా రిలీజ్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉండటంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి అప్పుడే మొదలైపోయింది. మరోపక్క రాజమౌళి, ఎన్టీఆర్, రాజమౌళి ఓ రేంజ్ లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాపై మరింత…