డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రౌద్రం రణం రుధిరం” మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ భారీగా చేపట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రమోషనల్ ఈవెంట్స్ , పలు ఇంటర్వూస్ తో “ఆర్ ఆర్ ఆర్ “టీమ్ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రావిపూడి , సంగీత దర్శకుడు కీరవాణి , యాంకర్ సుమలతో ఇంటర్వూస్ తో పాల్గొన్న రాజమౌళి , ఎన్టీఆర్ , రామ్ చరణ్ తాజాగా రానా దగ్గుబాటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. “ఆర్ ఆర్ ఆర్ “ మూవీ గురించి రాజమౌళి ని రానా అడిగితే ఈ మూవీ కంప్లీట్ ఫిక్షనల్ మూవీ అని చెప్పారు. రామ్ చరణ్ , ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్ గురించి మా స్నేహం ఈనాటిది కాదనీ , ఎప్పటినుంచో ఉందనీ ఎన్టీఆర్ చెప్పారు. ఎన్టీఆర్ , చరణ్ ల గురించి రానా రాజమౌళి ని అడిగితే ప్రారంభంలో ఎన్టీఆర్ కు స్టోరీస్ ఎంపిక లో పరిపక్వత లేదనీ , ఇప్పుడు అనుభవం తో స్టోరీస్ ఎంపిక చేసుకుంటున్నారనీ , రామ్ చరణ్ టాలెంటెడ్ అనీ , ఫిల్మ్ వర్క్ మీద ఐడియా లేదనీ , తరువాత చాల చేంజ్ అయ్యారనీ రాజమౌళి చెప్పారు. తమిళ వెర్షన్ కు రామ్ చరణ్ డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఒక వర్డ్ సింక్ కాకపోవడం తో 70, 80 టేక్స్ అయినా పర్ ఫెక్షన్ కై విసుగుచెందకుండా ట్రై చేయడం ఇంప్రెస్స్ చేసిందనీ రాజమౌళి చెప్పారు. యాక్షన్ సీన్స్ గురించి రాజమౌళి మాట్లాడుతూ .. యాక్షన్ సీన్స్ ఎమోషనల్ గా ఉంటేనే పర్ ఫెక్ట్ గా ఉంటుందని తన ఆలోచన అనీ , ఇంగ్లీష్ యాక్టర్స్ , హిందీ యాక్టర్స్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి రానా , రాజమౌళి ని అడిగితే ఇంగ్లీష్ యాక్టర్స్ ను ఎలా సంప్రదించాలి తెలియక శేఖర్ కపూర్ హెల్ప్ తీసుకున్నాననీ , ,హిందీ యాక్టర్స్ , తెలుగు యాక్టర్స్ అని కాకుండా అందరూ ఇండియన్ యాక్టర్స్ గా ఉండాలనుకుంటున్నా ననీ చెప్పారు. తనతో , చరణ్ తో మూవీ అనౌన్స్ చేయడం షాకింగ్ గా అనిపించిందని ఎన్టీఆర్ చెప్పారు. ఇప్పటి జనరేషన్ తో “ఆర్ ఆర్ ఆర్ “ మూవీ తరువాత మరిన్ని మల్టీ స్టారర్ చిత్రాలు వచ్చే అవకాశం ఉందని ఎన్టీఆర్ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: