బ్లాక్ బస్టర్ “భీమ్లా నాయక్” మూవీ లో తన పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ పార్టీ (జనసేన) కార్యకలాపాలతో బిజీ అయిపోయారు.ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్తారని సమాచారం. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముందుగా పవన్ కళ్యాణ్ “హరి హర వీరమల్లు”మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. ఇప్పటికే సుమారు 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. ఒకే షెడ్యూల్ లో మొత్తం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో”భవదీయుడు భగత్ సింగ్ “, సముద్ర ఖని దర్శకత్వంలో సూపర్ హిట్‘వినోదయ సితం” తమిళ మూవీ తెలుగు రీమేక్ కు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: