రామ్ గోపాల్ వర్మ-ఉపేంద్ర సినిమా టైటిల్ ఫిక్స్

RGV announces a new movie with Upendra,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates, Ram Gopal Varma,Director Ram Gopal Varma,Ram Gopal Varma Movies,Ram Gopal Varma Latest Updates,Ram Gopal Varma Movie Updates,Ram Gopal Varma New Updates,Ram Gopal Varma New Movie,Ram Gopal Varma Next Movie, Ram Gopal Varma New Project with Kannada Star,Ram Gopal Varma Movie with Upendra,Ram Gopal Varma Movie with kannada Star Hero Upendra,Hero Upendra Movie with RGV,RGV Movies,Director RGV Upcoming movie with Upendra, maverick director RGV,Maverick Director Ram Gopal Varma,Hero Upendra New Movies,Hero Upendra Upcoming Movies,Hero Upendra latest Movie Updates,Hero Upendra Movie Updates,Hero Upendra New Projects, Hero Upendra Movie Shooting Updates,Hero Upendra Shoot Updates, Hero Upendra Movies in 2022,RGV in social media announce movie with Kannada hero Upendra,RGV New Movie Titled as R, bankrolled by A Square productions,RGV Movie R Produed By Square Productions, RGV-Upendra collaboration,#RGV,#nimmaupendra

రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా కాస్త రియాలిటి కథలను తీయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇక కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సినిమాలు కూడా ఎంత డిఫరెంట్ గా ఉంటాయో తెలుసు. తను చేసే సినిమాలు, పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా. రామ్ గోపాల్ వర్మ-ఉపేంద్ర కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే అప్పటి నుండి దీనిపై పెద్దగా ఎలాంటి అప్ డేట్ లేదు. దాదాపు ఈసినిమా గురించి కూడా అందరూ మరిచిపోయారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజాాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు వర్మ. ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేస్తూ తన ట్విట్టర్ ద్వారా ఫిక్స్ చేశాడు. ఈసినిమాకు ఆర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అంతేకాదు ఈనేపథ్యంలో ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేయగా అందులో ఉపేంద్ర కత్తి పట్టుకొని కనిపిస్తున్నాడు. ఇక ఈసినిమా ఇండియా చరిత్రలోనే ఒక యూనిక్ గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు తెలిపాడు. కాగా ఈసినిమాను ఏ స్క్వేర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.

కాగా శివ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వర్మ మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత క్షణ క్షణం, అంతం, గాయం, రాత్రి వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏గా చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో చాలామంది వర్మ దగ్గర అసిస్టెంట్ గా చేసివాళ్లే. అయితే ఇప్పుడు మాత్రం వర్మ ఆ ట్రాక్ ను తప్పాడని చెప్పొచ్చు. పలు సినిమాలు తీస్తున్నా కూడా సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + two =