నాగచైతన్య మాత్రం చాలా జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒకపక్క వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇక మరోపక్క సినిమాలను చేస్తూనే మరోపక్క డిజిటల్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు. ఇప్పటికే నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమా వస్తుంది ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇది రిలీజ్ కాకముందే విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈసిరీస్ కూడా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇంకా వీటితో పాటు తెలుగులో పలు యంగ్ డైరెక్టర్లను కూడా నాగచైతన్య లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా మరో తమిళ్ డైరెక్టర్ తో సినిమా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా సినిమా రాబోతున్నట్టు.. దాదాపు ఈసినిమా ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలోపాల్గొన్న వెంకట్ ప్రభు తెలుగు, హిందీ భాషల్లో ‘మానాడు’ను రీమేక్ చేయనున్నానని… తెలుగులో నాగచైతన్యతో చేయనున్నానని తెలియచేశారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
కాగా శింబు హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన సినిమా మానాడు. ఈసినిమా పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. తమిళనాట విమర్శల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడమే కాదు వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో ఈసినిమా రీమేక్ అవుతుండటంతో అప్పుడే ఆసక్తి పెరిగిపోయింది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: