“ఐతే “(2003 ) మూవీ తో సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన కె కె సెంథిల్ కుమార్ , రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “సై”మూవీకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. రాజమౌళి , సెంథిల్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన “ఛత్రపతి “, “యమదొంగ “, “మగధీర “, “ఈగ “, “బాహుబలి “, బాహుబలి 2 ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. తాజాగా “రౌద్రం రణం రుధిరం “మూవీ తెరకెక్కింది. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ “మగధీర “, “బాహుబలి” , “బాహుబలి 2 ” మూవీస్ కు ఫిల్మ్ ఫేర్ , “ఈగ”, “బాహుబలి” మూవీస్ కు నంది అవార్డ్స్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రౌద్రం రణం రుధిరం “మూవీ ప్రమోషన్స్ లో సెంథిల్ కుమార్ మాట్లాడుతూ .. రాజమౌళి గారి ఆలోచనా విధానం వేరుగా ఉంటుందనీ , ఆయనతో కలిసి ఎక్కువ దూరం ప్రయాణం చేయడం వలన ఆయనకి ఏం కావాలనేది తనకు అర్థమైపోతుందనీ , ఆయన ఆశించేదానికంటే బెటర్ అవుట్ పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాననీ , అది తనకు ఒక ఛాలెంజ్ అనిపిస్తూ ఉంటుందనీ , ఈ సినిమాలో ఎన్టీఆర్ .. చరణ్ .. అలియా .. ఒలీవియా .. ఇలా చాలామంది ఆరిస్టులు ఉన్నారనీ , ఇంతమందిలో తన కెమెరా కళ్లకి నచ్చేదెవరని అడిగితే ఎన్టీఆర్ అనే చెబుతాననీ , కెమెరా ముందుకు ఎన్టీఆర్ రాగానే ఆయన ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటాయనీ , పుట్టుక తోనే ఆయన ఆర్టిస్ట్ అనీ , కంప్లీట్ యాక్టర్ అనిపిస్తూ ఉంటుందనీ , ఒక నటుడికి ఎలాంటి లక్షణాలు అయితే ఉండాలో అలాంటి లక్షణాలు పూర్తిగా కలిగినవాడిగా ఎన్టీఆర్ కనిపిస్తారనీ, ఒక సీన్ డైరెక్టర్ అనుకున్న విధంగా రావడానికి ఆ స్థాయిలో కష్టపడే ఆర్టిస్టుగా ఎన్టీఆర్ కనిపిస్తారనీ , చరణ్ కూడా గొప్ప స్టార్ అనీ , ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తారనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: