
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 163


"రాధేశ్యామ్"మూవీ రిజల్ట్ పై ప్రభాస్ స్పందన

సరిహద్దు జవాన్లతో 'రామ్ చరణ్'

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'కణ్మణి రాంబో ఖతీజా'

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన 'కాజల్'

మిస్ ఇండియా రేస్ లో శివాని రాజశేఖర్

'విక్రమ్' మూవీ రైల్వే ప్రమోషన్స్..!

శ్రీ నిధిశెట్టి టాలీవుడ్ ఎంట్రీ ?

అమృత్‌సర్ లో ఉపాసన ప్రత్యేక పూజలు..!

"#MEGA 154"మూవీ సెట్స్ లో శృతి హాసన్

ప్రముఖ నిర్మాత 'నారాయణ్ దాస్ నారంగ్' కన్నుమూత

“కృష్ణ వ్రింద విహారి" మూవీ రిలీజ్ డేట్

'అంటే సుందరానికి' టీజర్ రిలీజ్
న్యాచురల్ స్టార్ నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోతాడు కాబట్టే న్యాచురల్ స్టార్ అన్న పేరును సొంతం చేసుకోగలిగాడు. ఇప్పుడు మాత్రం విభిన్న తరహా కథలను ఎంచుకుంటూ.. విభిన్న పాత్రలను చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈమధ్య కాలంలో వచ్చిన వి, టక్ జగదీష్ రీసెంట్ గా వచ్చిన శ్యామ్ సింగ రాయ్ మూడు సినిమాలు కూడా కాస్త డిఫరెంట్ పాత్రలే. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో రావడానికి సిద్దమయ్యాడు.

తెలుగు రాష్ట్రాలలో 400 కోట్లతో "ఆర్ ఆర్ ఆర్ "రికార్డ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణ తో ప్రపంచవ్యాప్తంగా 1050 కోట్ల వసూళ్ళతో దూసుకుపోతోంది.

"రాధేశ్యామ్"మూవీ రిజల్ట్ పై ప్రభాస్ స్పందన
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.”రాధేశ్యామ్ ” మూవీ లో వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. లావిష్ గా తెరకెక్కిన “రాధేశ్యామ్” రెండు రోజులలోనే 100 కోట్ల క్లబ్ లో చేరి, 10 రోజులలో ప్రపంచవ్యాప్తంగా 204…

సరిహద్దు జవాన్లతో 'రామ్ చరణ్'
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయి ప్రభంజనం సృష్టిస్తుంది. రామ్ చరణ్ మంచి ప్రశంసలు దక్కాయి. మరోవైపు ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమాలో చిరు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. చరణ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి నటిస్తుండటంతో ఈసినిమాపై కూడా అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి.

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'కణ్మణి రాంబో ఖతీజా'
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా.. నయనతార, సమంత హీరోయిన్లుగా వస్తున్న సినిమా కాతు వాకుల రెండు కాదల్. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ”కణ్మణి రాంబో ఖతీజా” అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రంలోని ‘టూ టూ టూ’ అనే సాంగ్ గ్లింప్స్ ను మేకర్స్ రిలిక్ చేశారు. తమిళ్ లో ఈ సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా…

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన 'కాజల్'
తెలుగు సినీ పరిశ్రమలో చందమామ గా పేరుతెచ్చుకొని దశాబ్దం పైగా తన తన అందం, అభినయంతో అలరించి ఎంతో మంది స్టార్ హీరోలకు జోడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కాజల్. కేవలం తెలుగు మాత్రమే కాదు తమిళ్, హిందీ పలు భాషల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ కెరీర్ కాస్త డల్ అయితే పెళ్లి వైపు అడుగులు వేస్తారు. కానీ కాజల్ మాత్రం కెరీర్ ఇంకా బిజీ ఉన్నప్పుడే.. పలు అవకాశాలు వస్తున్నా కూడా వివాహా బంధంలోకి అడుగుపెట్టేసింది.

"సర్కారు వారి పాట" మూవీ కి కీర్తి సురేష్ డబ్బింగ్ ప్రారంభం
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ ప్రేమికుల రోజు సందర్భంగా “కళావతి” లిరికల్ సాంగ్ ,తరువాత సెకండ్ సింగిల్ పెన్నీ సాంగ్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

నైజాం లో 5రోజులకు 30 కోట్ల షేర్ తో ఫస్ట్ డబ్బింగ్ మూవీ గా మూవీ
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో 4రోజులలోనే 500 కోట్ల క్లబ్ లో చేరింది. 300 కోట్ల కలెక్షన్స్ తో “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ దూసుకుపోతూ ఫస్ట్ కన్నడ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల లోనూ “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.

మిస్ ఇండియా రేస్ లో శివాని రాజశేఖర్
సీనియర్ యాక్టర్ రాజశేఖర్ , యాక్ట్రెస్ , డైరెక్టర్ జీవిత ల పెద్ద కుమార్తె మోడల్ , డ్యాన్సర్ శివాని రాజశేఖర్ "అద్భుతం", WWW" వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. శివాని సోదరి శివాత్మిక "దొరసాని "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. శివాని తన సోదరి తో కలసి సినిమాలు నిర్మిస్తున్నారు. ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో పాల్గొంటున్నట్టు శివాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

'విక్రమ్' మూవీ రైల్వే ప్రమోషన్స్..!
కమల్ హాసన్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా విక్రమ్. కమల్ నుండి కూడా సినిమా వచ్చి చాలా రోజులు అయిపోవడంతో ఈసినిమా ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో కమల్ ఈసారి ఫుల్ మాస్ అవతారంలో కనిపించనున్నట్టు ఇప్పటికే అర్థమవుతుంది. . ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు మేకర్స్ కూడా ఈసినిమాపై బాగానే బజ్ క్రియేట్ చేయడానికి ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రమోషన్లో లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు రీసెంట్ గా విక్రమ్…

శ్రీ నిధిశెట్టి టాలీవుడ్ ఎంట్రీ ?
బెంగుళూరు జైన్ యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ అయిన శ్రీనిధిశెట్టి అందాల పోటీలలో 2015 సంవత్సరం లో మిస్ కర్ణాటక, 2016 సంవత్సరంలో మిస్ దివా సుప్రనేషనల్ , మిస్ సుప్రనేషనల్ విన్నర్ గా నిలిచారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1"మూవీ తో శాండల్ వుడ్ లో కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శ్రీనిధి శెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. శ్రీనిధిశెట్టి కథానాయికగా తెరకెక్కిన "కె జి ఎఫ్ చాప్టర్ 1 "మూవీ సీక్వెల్ "కె జి ఎఫ్ చాప్టర్ 2 "మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న…

అమృత్‌సర్ లో ఉపాసన ప్రత్యేక పూజలు..!
టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లిస్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన ల పేర్లు కూడా ఉంటాయి. ఇక రామ్ చరణ్ తన సినిమాలతో బిజీగా ఉన్నా.. మరో పక్క ఉపాసన తన బిజినెస్ లతో బిజీగా ఉన్నా ఎప్పటి కప్పుడు చరణ్ కు సంబంధించిన విషయాలను మాత్రం అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది ఉపాసన. ఇక తాజాగా ఉపాసన చరణ్ కోసం అమృత్ సర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. ఈ సందర్భంగా ఉపాసన.. Mr.C అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో లంగర్ సేవను నిర్వహించారు. రామ్ చరణ్ ప్రస్తుతం తన 15వ సినిమా షూటింగ్ తో బిజీగా ఉండటంతో ఈ సేవలో చెర్రీ తరపున పాల్గొనే ప్రత్యేక హక్కు, అవకాశం నాకు…

"#MEGA 154"మూవీ సెట్స్ లో శృతి హాసన్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. “క్రాక్ “, “వకీల్ సాబ్ ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ “సలార్ “, బాలకృష్ణ “#NBK 107 “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. రెండు తమిళ మూవీస్ కు శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "#MEGA 154"మూవీలో మెగా స్టార్ చిరంజీవి కి జోడీగా శృతి నటిస్తున్నారు.

'నారాయణ్ దాస్ నారంగ్' కు సినీ సెలబ్రిటీల నివాళులు
టాలీవుడ్ లో నేడు మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఏషియన్ ఫిలింస్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ నేడు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అస్వస్థతో ఇబ్బంది పడుతున్నారు. ఈనేపథ్యంలో స్టార్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుండగా పరిస్థితి విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలియచేస్తున్నారు.

శాండల్ వుడ్ లో "కె జి ఎఫ్ చాప్టర్ 2 "మూవీ న్యూ రికార్డ్స్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 250 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది.హీరో యష్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ కన్నడచిత్ర పరిశ్రమలో ల్యాండ్ మార్క్ ఫిల్మ్ గా నిలిచింది. ఒకప్పుడు లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కే కన్నడ సినిమాల రూపు రేఖలను దర్శకుడు ప్రశాంత్ నీల్ మార్చేశారు.

ప్రముఖ నిర్మాత 'నారాయణ్ దాస్ నారంగ్' కన్నుమూత
ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో పలు విషాదాలు ఎదురవుతూనే ఉన్నాయి. గత రెండేళ్లలో కరోనా వల్ల ఎంతో మంది సినీ ప్రముఖులను అలానే వయసు పైబడిన వారు ఇలా ఎన్నో కారణాల వల్ల ఎంతో మందిని కోల్పోయింది సినీ పరిశ్రమ. ఇక ఈ ఏడాది ప్రారంభమైన నాలుగునెలల్లోనే పలువురు సినీ సెలబ్రిటీలు కన్నుమూశారు. ఇక విషాదం నుండి కోలుకునే లోపే మరో విషాదం చోటుచేసుకుంటుంది. ఇటీవలే సీనియర్ కథానాయకుడు బాలయ్య మరణించగా అది మరిచిపోకముందో మరో ప్రముఖ నిర్మాత మరణించిన ఘటన చోటుచేసుకుంది.

'తెలుగు ఫిలిం నగర్' ట్విట్టర్ కు 1 మిలియన్ ప్రేమ..!
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఏ రేంజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాం. ఒక్క స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్నట్టే. ఇక సోషల్ మీడియా వేదికగా ఉన్న ట్విట్టర్, ఇన్ట్సా, ఫేస్ బుక్, యూ ట్యూబ్ వీటి హవా ఇప్పుడు నడుస్తుంది. అందుకే ఏ పరిశ్రమ అయినా సరే తమ మార్కెట్ పరంగా వీటిని కూడా ఉపయోగిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఎంటర్ టైన్ మెంట్ ఫీల్డ్స్ కు ఇవే ప్రధాన మార్గాలు. ప్రేక్షకులకు ఏ వార్త అయినా చేరవేయాలంటే వారథిలాగా పనిచేస్తుంటాయి. అలాంటి ఒక వారధే తెలుగు ఫిలిం నగర్ కూడా. ఇప్పటికే ది తెలుగుఫిలింనగర్.కామ్ అనే పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు మూవీ అప్ డేట్స్ ను ఇస్తుంటుంది తెలుగు ఫిలింనగర్.

'సర్కారు వారి పాట' మహేష్ మాస్ బ్లాస్ట్..!
పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని ఇటీవలే తెలిపింది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఆపాటను కూడా పూర్తిచేసే పనిలో పడింది చిత్రబృందం. ప్రస్తుతం ఆ పాట చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో మాస్ సాంగ్ కు హీరో హీరోయిన్లు మహేష్ బాబు, కీర్తీ సురేష్ స్టెప్పులేస్తున్నారు. ఇక ఈపాటతో ఈ సినిమా షూటింగ్ మొత్తం…

“కృష్ణ వ్రింద విహారి" మూవీ రిలీజ్ డేట్
శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణ లో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో నాగశౌర్య , సింగర్ , యూట్యూబర్ , యాక్ట్రెస్ షిర్లీ సేఠియా జంటగా తెరకెక్కిన “కృష్ణ వ్రింద విహారి" మూవీ మే 20 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. వెన్నెల కిషోర్ , సత్య , బ్రహ్మాజీ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. సాగర్ మహతి సంగీతం అందించారు.

నెల గ్యాప్ లో 2 మల్టీ స్టారర్స్ తో రామ్ చరణ్ రికార్డ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో అల్లూరి సీతారామరాజు గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మల్టీ స్టారర్ “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణ తో ప్రపంచవ్యాప్తంగా 1050 కోట్ల వసూళ్ళతో దూసుకుపోతోంది.