‘విక్రమ్’ మూవీ రైల్వే ప్రమోషన్స్..!

Crazy Promotions of Kamal Haasan’s Vikram Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram Movie,Vikram Telugu movie,Vikram Movie Updates,Vikram Movie Latest Updates,Vikram Upcoming Movie Updates,Kamal Haasan Vikram New Movie Updates,Vikram Movie Promotions, Vikram Movie Railway Promotions,Kamal Haasan Vikram Promotions at Railways,Kamal Haasan Vikram Latest Promotions Updates,Kamal Haasan Vikram Movie Promotions Updates, Kamal Haasan Movie Updates,Kamal Haasan New Movie Updates,Kamal Haasan Latest Movie Crazy Promotions,Kamal Haasan Movie Vikram

కమల్ హాసన్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా విక్రమ్. కమల్ నుండి కూడా సినిమా వచ్చి చాలా రోజులు అయిపోవడంతో ఈసినిమా ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో కమల్ ఈసారి ఫుల్ మాస్ అవతారంలో కనిపించనున్నట్టు ఇప్పటికే అర్థమవుతుంది. . ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు మేకర్స్ కూడా ఈసినిమాపై బాగానే బజ్ క్రియేట్ చేయడానికి ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రమోషన్లో లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు రీసెంట్ గా విక్రమ్ సినిమా ఫస్ట్ గ్లాన్స్ ని బీస్ట్, కె.జి.యఫ్ 2 చిత్రాలతో పాటు థియేటర్లలో ప్రదర్శించారు. ఇక ఇప్పుడు విక్రమ్ సినిమాకు మరో క్రేజీ ప్రమోషన్ దక్కింది. విక్రమ్ ఫస్ట్ లుక్ కు రైల్వే ప్రమోషన్స్ కూడా దక్కుతున్నాయి. ఈ విషయాన్ని సదరన్ రైల్వే సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియచేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి అలానే మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాలో కాళిదాస్ జయరాం, నరేన్, ఆంటోనీ వర్గీస్, అర్జున్ దాస్, శివానీ నారాయణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.