తెలుగు సినీ పరిశ్రమలో చందమామ గా పేరుతెచ్చుకొని దశాబ్దం పైగా తన తన అందం, అభినయంతో అలరించి ఎంతో మంది స్టార్ హీరోలకు జోడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కాజల్. కేవలం తెలుగు మాత్రమే కాదు తమిళ్, హిందీ పలు భాషల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ కెరీర్ కాస్త డల్ అయితే పెళ్లి వైపు అడుగులు వేస్తారు. కానీ కాజల్ మాత్రం కెరీర్ ఇంకా బిజీ ఉన్నప్పుడే.. పలు అవకాశాలు వస్తున్నా కూడా వివాహా బంధంలోకి అడుగుపెట్టేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా ప్రభాసం కాస్త ఎక్కువగా ఉన్న టైమ్ లోనే కాజల్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే కదా. 2020 అక్టోబర్ 30న ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లూతో వివాహం జరిగింది. విహహం తర్వాత కాజల్ తన ఫొటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. అంతేకాదు ఇటీవలే తను ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా సోషల్ మీడియా ద్వారానే తెలియచేసింది. ప్రెగ్నెంట్ టైమ్ లో కూడా తన వర్కవుట్స్ గురించి కూడా వీడియోలను షేర్ చేసుకునేది. ఇక ఇప్పుడు కాజల్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతోంది. నేడు కాజల్ అగర్వాల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఇన్ని రోజులు హీరోయిన్ గా అలరించిన కాజల్ ఇకనుండి మాతృత్వపు అనుభూతిని పొందనుంది. మరోవైపు కాజల్ దంపతులకు అందరూ అభినందనలు తెలుపుతున్నారు.
ఇక కాజల్ సినిమాల విషయానికొస్తే తను నటించిన హే సినామిక సినిమా ఇటీవలే రిలీజ్ అయింది. ఇక ప్రస్తుతం చిరుతో నటించిన ఆచార్య సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ అవుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























