కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా.. నయనతార, సమంత హీరోయిన్లుగా వస్తున్న సినిమా కాతు వాకుల రెండు కాదల్. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ”కణ్మణి రాంబో ఖతీజా” అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రంలోని ‘టూ టూ టూ’ అనే సాంగ్ గ్లింప్స్ ను మేకర్స్ రిలిక్ చేశారు. తమిళ్ లో ఈ సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోఇప్పటికే ఈ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేయగా తాజాగా ఈ సాంగ్ వీడియో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక ఫైనల్ గా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఏప్రిల్ 28వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో క్రికెటర్ శ్రీశాంత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోతో కలిసి విఘ్నేష్ శివన్ తన సొంత బ్యానర్ అయిన రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: