అమృత్‌సర్‌ లో ఉపాసన ప్రత్యేక పూజలు..!

Ram Charan Organises Langar Seva Under The Supervision Of Upasana,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ram Charan,Mega Power Star Ram Charan,Ram Charan latest updates,Ram Charan latest News,Ram Charan At Golden Temple,Ram Charan Organises Langar Seva,Ram Charan Organises Langar Seva in Golden Temple, Ram Charan Visited Goledn Temple,Ram Charan at Amritsar Goledn Temple,Ram Charan Visited Amritsar Golden Temple and Organise Langar Seva,Ram Charan Langar Seva under the Supervision of upasana, Ram Charan and upasana At Golden Temple,Ram Charan and upasana Organises Langar Seva in Golden Temple

టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లిస్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన ల పేర్లు కూడా ఉంటాయి. ఇక రామ్ చరణ్ తన సినిమాలతో బిజీగా ఉన్నా.. మరో పక్క ఉపాసన తన బిజినెస్ లతో బిజీగా ఉన్నా ఎప్పటి కప్పుడు చరణ్ కు సంబంధించిన విషయాలను మాత్రం అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది ఉపాసన. ఇక తాజాగా ఉపాసన చరణ్ కోసం అమృత్ సర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. ఈ సందర్భంగా ఉపాసన.. Mr.C అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో లంగర్ సేవను నిర్వహించారు. రామ్ చరణ్ ప్రస్తుతం తన 15వ సినిమా షూటింగ్ తో బిజీగా ఉండటంతో ఈ సేవలో చెర్రీ తరపున పాల్గొనే ప్రత్యేక హక్కు, అవకాశం నాకు లభించింది. రామ్ చరణ్, నేను మీ ప్రేమతో ఆశీర్వదించబడ్డాము. వినయంతో అంగీకరిస్తున్నాను” అంటూ గోల్డెన్ టెంపుల్ లోని ప్రత్యేక పూజ విషయాన్ని వెల్లడించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రస్తుతం రామ్ చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ తో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు చరణ్. మల్టీస్టారర్ గా వచ్చిన ఈసినిమాలో రామ్ చరణ్ నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. సౌత్ లో మాత్రమే కాదు నార్త్ లో కూడా చరణ్ కు మంచి క్రేజ్ పెరిగింది. మరోవైపు తండ్రి మెగాస్టార్ తో కలిసి నటించిన ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈ నెల 29న ఈసినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే తను తన తరువాత ప్రాజెక్ట్ అయిన శంకర్ సినిమాతో జిజీ అయిపోయాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పంజాబ్ లో జరుగుతోంది. కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − twelve =