
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 153


హీరో విశాల్ న్యూ మూవీ "మార్క్ ఆంటోని " ప్రారంభం

"#Thalapathy66" మూవీ అప్ డేట్

'డ్రైవర్ జమున' ఫస్ట్ లుక్ రిలీజ్

'భళా తందనాన' నెవర్ బిఫోర్ క్లైమాక్స్ చూస్తారు..!

టాలీవుడ్ పై పూజాహెగ్డే ప్రశంసలు

కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా టాలీవుడ్ కు రీఎంట్రీ
నా సినిమాను ఆదరిస్తారన్న నమ్మకం ఉంది..!

'హ్యాపీ బర్త్ డే' రిలీజ్ డేట్ ఫిక్స్..!

'యశోద' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్..!

"#NTR30 "మూవీ కి ప్రిపేర్ అవుతున్న ఎన్టీఆర్
బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్ ” మూవీ ఘనవిజయం సాధించింది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

హీరో విశాల్ న్యూ మూవీ "మార్క్ ఆంటోని " ప్రారంభం
పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ హీరో విశాల్ తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పలు సూపర్ హిట్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను యాక్షన్ చిత్ర హీరో విశాల్ అలరిస్తున్నారు. విశాల్ ప్రస్తుతం "లాఠీ ", "డిటెక్టివ్ 2 " మూవీస్ లో నటిస్తున్నారు."డిటెక్టివ్ 2 " మూవీ కి విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో విశాల్ మరో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అల్లు అర్జున్ , రామ్ చరణ్ లతో నటించాలని ఉంది -సీనియర్ హీరోయిన్ సితార
సక్సెస్ ఫుల్ "పుదు పుదు అర్ధంగళ్ " (1989 )మూవీ తో కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన సితార తెలుగు , కన్నడ , తమిళ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. మమ్ముట్టి , మోహన్ లాల్ , శివాజీ గణేశన్ , రజనీ కాంత్ , విష్ణు వర్ధన్ , శివరాజ్ కుమార్ , చిరంజీవి , రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ హీరోల మూవీస్ లో నటించిన సితార అన్ని భాషల మొదటి సినిమాలు ఘనవిజయం సాధించడం విశేషం.

ఎన్టీఆర్ వివాహ వార్షికోత్సవంలో ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ
బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్ ” మూవీ ఘనవిజయం సాధించింది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం…

మాస్ ట్రీట్ కు రెడీ అయిన 'సర్కారు వారి పాట'
ప్రస్తుతం ఎక్కడ చూసినా సర్కారు వారి పాట సందడే కనిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా వారం రోజులు టైం ఉండటంతో చిత్రయూనిట్ కూడా వీలైనంత బజ్ క్రియేట్ చేయడానికి చూస్తుంది. ఈసినిమా నుండి ఏ అప్ డేట్ అది సినిమాపై మరింత క్రేజ్ ను పెంచేస్తుంది. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన దగ్గరనుండి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ వరకూ అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. వేటికవే ఒకదానిని మించి ఒకటి ఉండటంతో ప్రేక్షకులు కూడా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

"#Thalapathy66" మూవీ అప్ డేట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న "#Thalapathy66" మూవీ చెన్నై లో పూజా కార్యక్రమం తో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ తో ప్రారంభం అయిన ఈ మూవీ లో శరత్ కుమార్ , ప్రకాష్ రాజ్ , శ్యామ్ , యోగిబాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

'డ్రైవర్ జమున' ఫస్ట్ లుక్ రిలీజ్
విభిన్నమైన కథలతో.. తన నటనతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. కౌసల్యాకృష్ణమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య రాజేష్.. విజయ్ దేవరకొండ తో వరల్డ్ ఫేమస్ లవర్ అలానే నానితో కలిసి టక్ జగదీష్ చిత్రాల్లో నటించింది. ఇక ఇప్పుడు తాజాగా 'డ్రైవర్ జమున' పేరుతో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉండగా.. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు “డ్రైవర్ జమున” ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ముఖం మీద చెమటలు, రక్తం మరకలతో ఫిరోషియస్ గా కనిపించారు ఐశ్వర్య రాజేష్.

'భళా తందనాన' నెవర్ బిఫోర్ క్లైమాక్స్ చూస్తారు..!
చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు, క్యాథరిన్ థ్రెసా హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం భళా తందనాన. రేపు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా గురువారంనాడు హీరో శ్రీవిష్ణు మీడియా సమావేశంలో చిత్రం గురించి పలు విషయాలు తెలియజేశారు.

టాలీవుడ్ పై పూజాహెగ్డే ప్రశంసలు
హీరో నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో పూజా హెగ్డే టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.“F 3” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే నటించారు.పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా టాలీవుడ్ కు రీఎంట్రీ
డ్యాన్సర్ , కొరియోగ్రాఫర్ , నటుడు , నిర్మాత , దర్శకుడు గా ప్రభుదేవా దక్షిణాదిభాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా 2 నేషనల్ అవార్డ్స్ తో పాటు పలు అవార్డ్స్ అందుకున్నారు. పద్మశ్రీ ప్రభుదేవా ప్రస్తుతం 3కన్నడ , 6 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. కొంత కాలం గ్యాప్ తరువాత ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నారు.

బాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసింగ్ సెకండ్ మూవీ గా "కె జి ఎఫ్ చాప్టర్ 2"
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2“కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది.

హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లో "ఆర్ ఆర్ ఆర్ " రికార్డ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
నా సినిమాను ఆదరిస్తారన్న నమ్మకం ఉంది..!
ఎన్నో ఏళ్లుగా బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా రాణిస్తున్న సుమ ఇప్పుడు వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేస్తుంది. దాదాపు దశాబ్దంన్నర తరువాత మళ్లీ జయమ్మ పంచాయితీ అనే సినిమాతో సుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక సుమ సినిమా కాబట్టి అందరూ ఈసినిమాకోసం ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈసినిమా ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. ఎంతోమంది స్టార్ హీరోలు సైతం ఈసినిమా ప్రమోషన్స్ లో భాగమయ్యారు.

త్రిష "ది రోడ్ "మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో త్రిష తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్న సీనియర్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 1", "పొన్నియిన్ సెల్వన్ 2 ", "శెతురంగ వెట్టై "(తమిళ ) రామ్ (మలయాళ ) మూవీస్ లో నటిస్తున్నారు. పలు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన త్రిష మరో ఉమెన్ సెంట్రిక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'సర్కారు వారి పాట' మరో రికార్డ్.. స్పెషల్ ఎమోజీ సర్ ప్రైజ్..!
పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు రిలీజ్ కు ముందే ఈసినిమా పలు రికార్డులు క్రియేట్ చేసుకుంటుంది. ఇప్పటికే పాటలు రూపంలో అలానే టీజర్, ట్రైలర్ ఇలా పలు విషయాల్లో రికార్డులు క్రియేట్ చేసుకుంటుంది ఈసినిమా. ఇక ఇప్పుడు ఈసినిమాకు మరో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ రివీల్ చేశారు చిత్రయూనిట్. ఈమధ్యకాలంలో సినిమాలకు ఎమోజీలు రావడం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు సర్కారు వారి పాట కు కూడా స్పెషల్ ఎమోజీ వచ్చేసింది. మహేష్ బాబు కు సంబంధించిన స్పెషల్ ఎమోజీని తీసుకొచ్చారు. ఈ ఎమోజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో…

'హ్యాపీ బర్త్ డే' రిలీజ్ డేట్ ఫిక్స్..!
అందాల రాక్షసి`గా తెలుగు తెరకు పరిచయమైన నటి లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్లో అందాల రాక్షసిగా ముద్ర వేసుకుంది. ఇక ఆ సినిమా తరువాత లావణ్య పలు సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూనే ఉంది. అయితే లావణ్యకు మాత్రం సక్సెస్ రేటు మాత్రం తక్కువే అని చెప్పొచ్చు. అయినా జయాపజయాలను పక్కనపెట్టి అవకాశాలు అందిపుచ్చుకుంటూ తనేంటో నిరూపించుకుంటుంది. ఈమధ్య కాలంలో వచ్చిన చావు కబురు చల్లగా అలానే ఏ1 ఎక్స్ ప్రెస్ లాంటి సినిమాలు కూడా సరైన విజయాన్ని అందిచలేకపోయాయి.

'అశోక వనంలో అర్జున కళ్యాణం' పై యంగ్ హీరోల ప్రీ రివ్యూ..!
విద్యా సాగర్ చింత దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. ఇక ఈసినిమాకు రీసెంట్ గా కావాల్సినంత పబ్లిసిటీ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు దగ్గర నుండి టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

"సర్కారు వారి పాట"ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. అజయ్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నదియా, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

ఫీమేల్ క్యారెక్టర్ లో నటించడానికి సిద్ధమే - విశ్వక్ సేన్
బి వి ఎస్ ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్ వి సి సి డిజిటల్ బ్యానర్ పై విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా తెరకెక్కిన "అశోకవనం లో అర్జున కళ్యాణం" మూవీ 6 వ తేదీ రిలీజ్ కానుంది. రితిక నాయక్ , గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో నటించారు. జై క్రిష్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, ట్రైలర్, సింగిల్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

'యశోద' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్..!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దం పాటుగా రాణిస్తూనే ఉంది సమంత. అయితే ఇన్నేళ్ల కెరీర్ లో తను ఎన్నో పాత్రలు చేసినా ప్రస్తుతం మాత్రం తన రూటును మార్చేసింది. ప్రేక్షకులు ఇప్పుడు కొత్తదనం, డిఫరెంట్ పాత్రలను కోరుకుంటున్నారు కాబట్టి అందుకు అనుగుణంగా పాత్రలను సెలక్ట్ చేసుకుంటూ వెళుతుంది. ఒకపక్క పాత్ర ప్రధానమైన సినిమాలు చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలనే ఎక్కువగా లైన్ లో పెడుతుంది. ఇప్పటికే గుణశేఖర్ తో శాకుంతలం సినిమాను చేస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.