‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ పై యంగ్ హీరోల ప్రీ రివ్యూ..!

Sai Dharam Tej And Siddhu Jonnalagadda Praise Ashoka Vanamlo Arjuna Kalyanam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ashoka Vanamlo Arjuna Kalyanam,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie,Ashoka Vanamlo Arjuna Kalyanam Telugu Movie,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Updates,Ashoka Vanamlo Arjuna Kalyanam Latest Movie Updates, Ashoka Vanamlo Arjuna Kalyanam New Movie Updates,Ashoka Vanamlo Arjuna Kalyanam Upcoming Movie,Sai Dharam Tej And Siddhu Jonnalagadda Praise Vishwak Sen Movie Ashoka Vanamlo Arjuna Kalyanam, Hero Sai Dharam Tej Praise Ashoka Vanamlo Arjuna Kalyanam Movie,Siddhu Jonnalagadda Praise Ashoka Vanamlo Arjuna Kalyanam Movie,Sai Dharam Tej about Ashoka Vanamlo Arjuna Kalyanam Movie, Siddhu Jonnalagadda About Ashoka Vanamlo Arjuna Kalyanam Movie,Movie First Review By Tollywood Actors,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie First Review By Tollywood Actors, Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Review,Ashoka Vanamlo Arjuna Kalyanam Telugu Movie Review,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie First Review

విద్యా సాగర్ చింత దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ హీరోగా వస్తున్న సినిమా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. ఇక ఈసినిమాకు రీసెంట్ గా కావాల్సినంత పబ్లిసిటీ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు దగ్గర నుండి టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా రిలీజ్ కు ఇంకా ఒక రోజు టైమ్ ఉండగానే ప్రీ రివ్యూ ఇచ్చేస్తున్నారు టాలీవుడ్ యంగ్ హీరోలు సాయి తేజ్, సిద్దూ జొన్నలగడ్డ. సాయి తేజ్ తన ట్విట్టర్ ద్వారా ఈసినిమా గురించి ట్వీట్ చేశాడు. అకోశ వనంలో అర్జున కళ్యాణం సినిమా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇంకా ఎమోషనల్ సినిమా.. చాలా ఎంజాయ్ చేశాను.. అర్జున్ పాత్రలో నువ్వు ఒదిగిపోయిన విధానం.. నీ ట్రాన్ఫమేషన్ సూపర్ అంటూ ట్వీట్ చేశాడు. టీమ్ అందరకీ కంగ్రాట్స్ చెప్పాడు.

ఇక సిద్దూ జొన్నలగడ్డ కూడా తన ట్వీట్ లో అశోకవనంలో అర్జున కళ్యాణం బ్యూటిఫుల్ సినిమా.. సినిమా మొత్తం నవ్వుతూనే చేశాను.. హానెస్ట్ రైటింగ్.. జెన్యూన్ పెర్ఫామెన్స్.. చిత్రయూనిట్ అందరికీ కంగ్రాట్స్ అంటూ పేర్కొన్నాడు. మరి రిలీజ్ కు ముందే ఈ ఇద్దరు హీరోలు ఇచ్చిన ప్రీ రివ్యూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది. ఆడియన్స్ కు ఎలా నచ్చుతుందో చూడాలి మరి.

కాగా ఈసినిమాలో రుక్సార్‌ దిల్లాన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బాపినీడు, సుధీర్ నిర్మిస్తున్నారు. జయ ఫణి సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా ప‌వి కె.ప‌వ‌న్‌ పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =