టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దం పాటుగా రాణిస్తూనే ఉంది సమంత. అయితే ఇన్నేళ్ల కెరీర్ లో తను ఎన్నో పాత్రలు చేసినా ప్రస్తుతం మాత్రం తన రూటును మార్చేసింది. ప్రేక్షకులు ఇప్పుడు కొత్తదనం, డిఫరెంట్ పాత్రలను కోరుకుంటున్నారు కాబట్టి అందుకు అనుగుణంగా పాత్రలను సెలక్ట్ చేసుకుంటూ వెళుతుంది. ఒకపక్క పాత్ర ప్రధానమైన సినిమాలు చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలనే ఎక్కువగా లైన్ లో పెడుతుంది. ఇప్పటికే గుణశేఖర్ తో శాకుంతలం సినిమాను చేస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో పాటుగా సమంత హరి – హరీష్ దర్శకత్వంలో వస్తున్న యశోద సినిమాలో నటిస్తుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాతో మరో డిఫరెంట్ జోనర్ తో వచ్చేస్తుంది సమంత. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలవ్వగా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అంతేకాదు దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చినట్టు సమాచారం. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే నేడు ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది.
There’s so much beyond what u see 💥
Fascinating first glimpse of @Samanthaprabhu2‘s #Yashoda out now 🕊️
యశోద यशोदा யசோதா യശോദ ಯಶೋದಾ#YashodaFirstGlimpse@varusarath5 @Iamunnimukundan @dirharishankar @hareeshnarayan @krishnasivalenk @SrideviMovieOff @PulagamOfficial pic.twitter.com/FJUVkaJ7PZ
— Sridevi Movies (@SrideviMovieOff) May 5, 2022
కాగా సమంత తో పాటు ఇంకా ఈసినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఆగష్ట్ 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: