ఎన్టీఆర్ వివాహ వార్షికోత్సవంలో ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ

Jr NTR and Prashant Neel celebrate their wedding anniversaries

బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్ ” మూవీ ఘనవిజయం సాధించింది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ “#ఎన్టీఆర్ 31 ” మూవీ ని తెరకెక్కించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , దర్శకుడు ప్రశాంత్ నీల్ వివాహం ఒకే రోజు ( మే 5వ తేదీ) జరగటం విశేషం. నిన్న వీరి వెడ్డింగ్ యానివర్సరీల సందర్భంగా ఇరు కుటుంబాలు కలిసి హైదరాబాద్ లో సెలబ్రేట్ చేసుకున్నాయి. ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, ప్రశాంత్ నీల్, ఆయన భార్య లిఖితలు వేడుక జరుపుకున్నారు. ఆ సెలబ్రేషన్ కు సంబంధించిన ఫొటోస్ ను ఎన్టీఆర్ సరికొత్త ప్రారంభం అంటూ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో “సలార్” మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.