ప్రస్తుతం ఎక్కడ చూసినా సర్కారు వారి పాట సందడే కనిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా వారం రోజులు టైం ఉండటంతో చిత్రయూనిట్ కూడా వీలైనంత బజ్ క్రియేట్ చేయడానికి చూస్తుంది. ఈసినిమా నుండి ఏ అప్ డేట్ అది సినిమాపై మరింత క్రేజ్ ను పెంచేస్తుంది. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన దగ్గరనుండి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ వరకూ అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. వేటికవే ఒకదానిని మించి ఒకటి ఉండటంతో ప్రేక్షకులు కూడా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకూ మూడు పాటలను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అందులో మొదటి పాట కళావతి సాంగ్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ తరువాత పెన్నీ సాంగ్ రిలీజ్ చేశారు. ఇక ఈపాటలో మహేష్ కూతురు సితార కనిపించి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. దీంతో ఈపాట కూడా పాపులర్ అయింది. ఆ తరువాత రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మాస్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు చిత్రయూనిట్. ఈసినిమా నుండి మ..మ..మహేషా అనే మాస్ సాంగ్ ను మే 7వ తేదీన ఈపాటను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
#SVPMania will Peak ❤️🔥
Super🌟 @urstrulyMahesh & @KeerthyOfficial are ready with their Mass Moves🕺💃
MASSiest Song of the Season #MaMaMahesha on 7th May 💥#SarkaruVaariPaata #SVP@ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/Vvd6VdtgiQ
— Mythri Movie Makers (@MythriOfficial) May 6, 2022
పరుశురాం దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. బ్యాంకుల కుంభకోణం నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు అర్థమవుతుంది. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సముద్రఖని కూడా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. ఆర్ మధి సినిమాటోగ్రఫీ, ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: