పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ హీరో విశాల్ తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పలు సూపర్ హిట్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను యాక్షన్ చిత్ర హీరో విశాల్ అలరిస్తున్నారు. విశాల్ ప్రస్తుతం “లాఠీ “, “డిటెక్టివ్ 2 ” మూవీస్ లో నటిస్తున్నారు.”డిటెక్టివ్ 2 ” మూవీ కి విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో విశాల్ మరో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మినీ స్టూడియో బ్యానర్ పై విశాల్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్ 33 మూవీ గా యాక్షన్ ఎంటర్ టైనర్ “మార్క్ ఆంటోని ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రీతూ వర్మ కథానాయిక . జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ “మార్క్ ఆంటోని” గా అనౌన్స్ చేస్తూ విశాల్ లుక్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. “మార్క్ ఆంటోని” తమిళ మూవీ షూటింగ్ 5 వ తేదీ పూజా కార్యక్రమం తో ప్రారంభం అయ్యింది. ఈ మూవీ లో హీరో విశాల్ , ఎస్ జె సూర్య ద్విపాత్రాభినయం చేయడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: