సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. అజయ్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నదియా, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “సర్కారు వారి పాట” ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.తాజాగా “సర్కారు వారి పాట” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 7 వ తేదీ హైదరాబాద్ , యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరగనుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ ఫస్ట్ టైమ్ జంటగా నటించిన “సర్కారు వారి పాట” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: