‘డ్రైవర్ జమున’ ఫస్ట్ లుక్ రిలీజ్

Driver Jamuna Movie First Look Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Driver Jamuna,Driver Jamuna Movie,Driver Jamuna Telugu Movie,Driver Jamuna Movie Updates,Driver Jamuna Telugu Movie Updates,Driver Jamuna New Movie,Driver Jamuna latest Movie Updates, Driver Jamuna First Look Out Now,Driver Jamuna Movie First Look Released,Driver Jamuna First look Reveiled,Driver Jamuna latest First look Released,Driver Jamuna Upcoming Movie Updates, Aishwarya Rajesh Movie Updates,Actress Aishwarya Rajesh Upcoming Movie Driver Jamuna,Aishwarya Rajesh latest Movie Updates,Aishwarya Rajesh Driver jamuna First Look Released

విభిన్నమైన కథలతో.. తన నటనతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. కౌస‌ల్యాకృష్ణ‌మూర్తి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు దగ్గరైన ఐశ్వర్య రాజేష్.. విజయ్ దేవరకొండ తో వరల్డ్ ఫేమస్ లవర్ అలానే నానితో క‌లిసి ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాల్లో నటించింది. ఇక ఇప్పుడు తాజాగా ‘డ్రైవర్ జమున’ పేరుతో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉండగా.. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు “డ్రైవర్ జమున” ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ముఖం మీద చెమటలు, రక్తం మరకలతో ఫిరోషియస్ గా కనిపించారు ఐశ్వర్య రాజేష్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లేడీ క్యాబ్ డ్రైవర్ జీవితంలో చోటు చేసుకున్న నాటకీయ సంఘటనల నేపధ్యంలో ‘డ్రైవర్ జమున’ చిత్రాన్ని థ్రిల్లింగ్ గా రూపొందిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ ఈ పాత్ర కోసం చాలా మంది లేడీ క్యాబ్ డ్రైవర్లని కలసి వారి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు నేచురల్ గా ఈ పాత్రకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. సాధారణంగా రోడ్ మూవీస్ ని బ్లూ మ్యాట్ టెక్నాలజీని ఉపయోగించి చిత్రీకరిస్తారు. ఐతే ఐశ్వర్య రాజేష్ ప్రతి ఒక్క షాట్ ని ఎటువంటి డూప్ లేకుండా.. తన పాత్ర వాస్తవానికి దగ్గరగా వుండే విధంగా స్వయంగా రోడ్లపై కారుని నడిపారట.

కాగా ఔట్ అండ్ ఔట్ రోడ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పా. కిన్స్లిన్ దర్శకత్వం వహిస్తుండగా 18 రీల్స్పై ఎస్.పి.చౌదరి నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కి గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రాఫర్ గా, ఆర్ రామర్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 3 =