బి వి ఎస్ ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్ వి సి సి డిజిటల్ బ్యానర్ పై విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా తెరకెక్కిన “అశోకవనం లో అర్జున కళ్యాణం” మూవీ 6 వ తేదీ రిలీజ్ కానుంది. రితిక నాయక్ , గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో నటించారు. జై క్రిష్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, ట్రైలర్, సింగిల్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అశోకవనం లో అర్జున కళ్యాణం” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ .. ఈ మూవీ తన కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందనీ , కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాననీ , కథ విన్న వెంటనే ఓకే చేశాననీ , 30 ఏళ్ల వయసు మీద పడిన పెళ్లి కాని అల్లం అర్జున్ కుమార్ క్యారెక్టర్ లో నటించాననీ , తన పాత్ర ప్రేక్షకులను మెప్పిస్తుందనీ , “మల్లీశ్వరి”, “నువ్వు నాకు నచ్చావ్” లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు వచ్చి చాలా రోజులైందనీ , ఇప్పుడు అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ను మా సినిమా అందిస్తుందనే నమ్మకం ఉందనీ , యాక్టర్‌గా నాకు విభిన్నమైన పాత్రలు చేయాలని ఉందనీ , ఫీమేల్ క్యారెక్టర్ చేయడానికి సిద్ధమేననీ , ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తాననీ , “ఓరిదేవుడో” రిలీజ్‌కు సిద్ధంగా ఉందనీ , “ధమ్కీ” మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాననీ , స్వంత బ్యానర్ లో “స్టూడెంట్ “మూవీ చేస్తున్నాననీ , “ఫలక్‌నుమా దాస్ 2” మూవీ సెట్స్‌పైకి వెళ్తుందనీ , పాన్ ఇండియా స్థాయిలో ఉంటుందనీ చెప్పారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: