‘భళా తందనాన’ నెవర్ బిఫోర్ క్లైమాక్స్ చూస్తారు..!

Sree Vishnu about Bhala Thandhanana Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bhala Thandhanana Movie,Bhala Thandhanana Telugu Movie,Bhala Thandhanana Movie Climax,Bhala Thandhanana Movie Never Before Climax Scene,Sree Vishnu about Bhala Thandhanana Movie Climax Scene, Sree Vishnu Movie Updates,Sree Vishnu Upcoming Movies,Sree Vishnu latest Movie Updates,Sree Vishnu latest Movie News,Sree Vishnu Next Project, Bhala Thandhanana Movie Review,Bhala Thandhanana Telugu Movie Review,Bhala Thandhanana Review,Bhala Thandhanana,Bhala Thandhanana Movie,Bhala Thandhanana Telugu Movie, Bhala Thandhanana First Review,Bhala Thandhanana Movie Public Talk,Bhala Thandhanana Movie Public Response,Bhala Thandhanana Movie Live Updates,Bhala Thandhanana Movie Story, Bhala Thandhanana Movie Highlights And Plus Points,Sree Vishnu,Catherine,Mani Sharma,Chaitanya Dantuluri

చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు, క్యాథరిన్ థ్రెసా హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం భళా తందనాన. రేపు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా గురువారంనాడు హీరో శ్రీవిష్ణు మీడియా సమావేశంలో చిత్రం గురించి పలు విషయాలు తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చైతన్య దంతులూరి కథ చెప్పగానే మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏమిటి?
ఈ కథ నాకు బాణం సినిమా అప్పుడే చెప్పారు. బసంతి టైంలో ఓ సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ అప్పటికీ పూర్తిగా కథ వర్కౌట్ కాలేదు. ఆ తరువాత తను బిజీ అయ్యాడు నేను బిజీ అయ్యాను. నాలుగేళ్ళు తర్వాత కథకు ఒక రూపం రావడంతో బాగా నచ్చి ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. అయితే ముందుగా ఈ ప్రొడక్షన్ వేరే వేరే అనుకున్నాం ఫైనల్ గా సాయి కొర్రపాటి గారు రావడంతో ఈ సినిమాకు ఒక క్రేజ్ ఏర్పడింది.

ఇందులో కొత్తగా చూపించే అంశాలు ఏమిటి?
ముందు 25 నిమిషాలు క్యారెక్టర్ల పరిచయం ఉంటుంది. రానురాను కథలో డెప్త్ వెళ్లడంతో ప్రతి క్యారెక్టర్ హైలైట్ గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇంతవరకు రాని కొత్త కోణం ఇందులో హైలెట్ గా ఉంటుంది. క్లైమాక్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.

కె.జి.యఫ్ విలన్ గరుడ రామ్ మీకు విలన్ గా నటించడం ఎలా అనిపించింది?
కె.జి.యఫ్ వంటి అంత పెద్ద సినిమాలో చేసిన ఆయన నా సినిమాలో చేయడం చాలా గొప్పగా ఉంది. ఆయనతో వచ్చే ఫైట్ సీక్వెన్స్ సినిమాను నిలబెడతాయి. ఒక అరుదైన కొత్త క్లైమాక్స్ ఈ సినిమాలో చూస్తారు.

గరుడ రామ్ విలన్ అనగానే ఎలా ఫీలయ్యారు?
కె.జి.యఫ్ సినిమాతో దేశం మొత్తం తెలిసిన విలన్ ఆయన. ఆయన నా సినిమాలో విలన్ ఏంటి అనేది అందరికీ అనిపిస్తుంది. మొదట్లో నాకూ అనిపించింది. మొదట నేను భయపడ్డాను. ఎందుకంటే కెజిఎఫ్ లో చూసిన ఆయన నటన అలాంటిది. కానీ సెట్లో ఆయన చాలా హంబుల్ గా ఉండడం చూసి ఆశ్చర్యపోయా. పైగా ఆయన మన తెలుగు వాడు కావడం విశేషం.

భళా తందనాన టైటిల్ పెట్టడానికి కారణం?
ఇది అన్నమయ్య కీర్తనలోనిది. ఆయన ఎన్నో వేల కీర్తనలు రాశారు. అందులో తందనానా భళాతందనానా అంటూ విప్లవాత్మకమైన కీర్తన రాశారు. ప్రకృతితో పాటు మనిషికి డబ్బు, కులం, మతం వంటి అంశాలు చర్చిస్తూ రాసిన ఈ గీతం చాలా హైలెట్ అయింది. మా కథకు యాప్ట్ అయ్యే టైటిల్ ఇది. కామన్ మ్యాన్ కు రీచ్ అవుతుంది. అచ్చమైన తెలుగు పదం ఇది. ఇప్పటి జనరేషన్ కి కూడా తెలియాలని పెట్టాం. ఈమధ్య చాలా ఆంగ్లపదాలు వస్తున్నాయి. నాకు తెలుగు టైటిల్స్ పెట్టడం అంటే ఇష్టం. బ్రోచెవారెవరురా, రాజ రాజ చోర.. వంటి నా టైటిల్స్ అన్నీ తెలుగు లోనే వుంటాయి.

దర్శకుడు చైతన్యతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
నేను బాణం నుంచి తనతో ట్రావెల్ అయ్యాను. 14 ఏళ్ళ అనుబంధం. తను సెట్లో మానిటర్ చూడరు. నాకు మొదట్లో అదే అనుమానం వచ్చి అడిగాను. నాకు ఫ్రేమ్ ఎలా వుందో, లైటింగ్ ఎట్లా పెట్టారో, నటీనటులు హావభావాలు అన్నీ నేను చెప్పినట్లే వస్తుంటాయి. అప్పడు మోనిటర్తో పనేంటి? అనేవారు. మొదటి సినిమాకే ఆయన అంత క్లారిటీగా వుండడంతో ఆయన ఆలోచన విధానం బాగా నచ్చింది. ఆయనకు అన్ని శాఖలపై పట్టు వుంది. అందుకే ఆయనతో పనిచేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది.

వారాహి బ్యానర్లో చేయడం ఎలా అనిపిస్తుంది?
ఖచ్చితంగా మంచి బ్యానర్ లో చేశాననే తృప్తి వుంది. సాయి కొర్రపాటి గారు క్యాస్టింగ్ విషయంలో కానీ టెక్నీషియన్స్ కానీ, నిర్మాణ విలువల్లో కానీ వెనుకంజ వేయరు. ఆయనకు అన్నింటిలోనూ అనుభవం ఉంది. ఇటీవల వచ్చిన వారాహి సినిమాలో మా సినిమా ది బెస్ట్ సినిమా అవుతుంది.

మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
నేను కామన్ మ్యాన్ గా నటించాను. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా కేథరిన్ నటించింది. కామన్ మ్యాన్ గా చాలా చేయాలి అనుకుంటాం, కానీ చేయలేం. ఆ సందర్భంలో ఈ జర్నలిస్టు సహకారం తీసుకుంటే ఎలా వుంటుంది అనేది నా పాత్ర. ఆ ప్రాసెస్ లో చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది.

కేథరిన్ నటన ఎలా అనిపించింది?
ఆమె చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆమె నాతో కంటే మిగిలిన చాలా పాత్రలతో కనెక్ట్ కావడంతో ఆమె నటనకు మంచి స్కోప్ వున్న పాత్ర అది. ఆమె కెరీర్ లో బెస్ట్ ఫిలిం అవుతుంది.

మీరు ఇంతకుముందు చేసిన అర్జున ఫల్గుణ.. ఇప్పుడు ఈ సినిమా మాస్ యాంగిల్ లో అనిపిస్తున్నాయి?
నేను ఇంతకుముందు చిన్న దొంగ గా చేశాను. కానీ కామన్ మ్యాన్ గా చేయడం ఇదే ఫస్ట్. కామన్ మ్యాన్ సొసైటీకి ఏం చేయగలడనే కోణంలో మాస్ అప్పీల్ వుంటుంది. ఒక బాధ్యతతో కూడిన పాత్ర కాబట్టి అలా అనిపిస్తుంది. ఇది వాంటెడ్ గా చేయాలని చేయలేదు. కథ పరంగా పాత్ర పరంగా వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను

సినిమా డిసప్పాయింట్ అయితే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది?
తప్పకుండా కొంచెం బాధ వుంటుంది. సినిమా బాగా ఆడాలని తీస్తాం. రిలీజ్ తర్వాత అది ప్రేక్షకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎటువంటి తీర్పు ఇచ్చినా మనం స్వీకరించాలి. ఈ ప్రాసెస్ లోనే పెట్టిన డబ్బులు పోయినా ఎవరైనా లాస్ అయిన సందర్భాలు తక్కువ. నేను చేసిన సినిమా వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంది.

మణిశర్మ శర్మ సంగీతం ఎలా అనిపించింది?
ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి బీజియమ్స్ చాలా ఇంపార్టెంట్. మణిశర్మ చక్కటి బాణీలతోపాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా ఇచ్చారు. ఇలాంటి సినిమాలకి సౌండ్ అనేది చాలా కీలకం. ఆ సౌండ్ విని చాలా మంది మళ్లీ మళ్లీ రావాలి అనిపించేటట్లుగా ఆయన మలిచారు ఇందులో. కొత్త బీజియమ్ మనం వింటాం. పాటలు కూడా సందర్భానుసారంగా ఉంటాయి.

ఇందులో లవ్ సీన్స్ ఎలా వుంటాయి?
నేను తనకి లవ్ ప్రపోజన్ చేసినా, తను నాకు చేసినా ఈ సందర్భంగా చాలా కొత్తగా ఉంటాయి. ఇంతవరకు ఏ సినిమాలో రాలేదని నేను భావిస్తున్నాను.

డిసప్పాయింట్ అయినప్పుడు ఈ కాంబినేషన్ లో చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా?
కాంబినేషన్ లో చేయటం అనేది కొంచెం ఇబ్బందికరమే. నేను ఇప్పుడు చేసిన సినిమాల వల్ల గుర్తింపు రావడం, కొత్త డైరెక్టర్లు నాతో చేసిన తర్వాత పెద్ద స్టార్స్ తో చేయడం ఆనందంగా వుంది.

టైటిల్ లో కత్తి, కలం ఉంది దాని అర్థం ఏమిటి?
కలం అనేది జర్నలిస్టు వృత్తి. కత్తి అనేది విలన్ కోణంలోనిది. హీరోకీ సంబంధం లేదు.

ఇప్పటివరకు విష్ణుకి సెన్సేషనల్ హిట్ అనేది లేదు కదా?
నిజమే. ఇప్పటి వరకూ నాకు అటువంటిది దక్కలేదు. అయితే ఇప్పుడే మంచి మంచి కథలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో మాత్రం సెన్సేషనల్ హిట్ ఒకటి ఇస్తాను.

ట్రైలర్ లో రెండు వేల కోట్లు అనేది వుంది. రెండు వేల కోట్లు ఏమిటి?
అదే కథ. అనుకోకుండా రెండు వేల కోట్ల సంఘటనలో నేను ఇరుక్కుంటాను. ఆ తర్వాత ఏమయిందనేది తెరపై చూడాల్సిందే.

కొత్త ప్రాజెక్టులు ఏమిటి?
ఇప్పుడిప్పుడే మంచి కథలు వస్తున్నాయి. అల్లూరి అనే సినిమా చేస్తున్నా. పోలీసు ఆఫీసర్ బయోపిక్. ఈ సినిమాతో మంచి హిట్ ఇవ్వగలననే నమ్మకముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 3 =