ఎన్నో ఏళ్లుగా బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా రాణిస్తున్న సుమ ఇప్పుడు వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేస్తుంది. దాదాపు దశాబ్దంన్నర తరువాత మళ్లీ జయమ్మ పంచాయితీ అనే సినిమాతో సుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక సుమ సినిమా కాబట్టి అందరూ ఈసినిమాకోసం ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈసినిమా ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. ఎంతోమంది స్టార్ హీరోలు సైతం ఈసినిమా ప్రమోషన్స్ లో భాగమయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రేపు ఈసినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మరోసారి సుమ తన సోషల్ మీడియా ద్వారా తన ఫీలింగ్ ను తెలియచేశారు. ఫైనల్ గా రేపు జయమ్మ పంచాయితీ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది.. అయితే ఈసినిమాకు వస్తారా?లేదా? అన్న భయం ఉంది.. అయితే నన్ను మీ కుటుంబసభ్యురాలిగా యాక్సెప్ట్ చేశారు. అందుకే ఇన్ని సంవత్సరాలనుండి బుల్లితెరపై నన్ను చూస్తూనే ఉన్నారు. ఆ నమ్మకం నా భయాన్ని పోగొట్టింది. మీరందరూ తప్పకుండా వస్తారు.. ఆదరిస్తారు అన్న నమ్మకం ఏర్పడింది. అలానే విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం, భళా తందనాన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ రెండు సినిమాలకు ఆల్ ద బెస్ట్ చెబుతుంది. అన్ని సినిమాలు బాగుండాలి.. అందులో మేమూ ఉండాలి అంటూ వీడియోలో తెలిపారు.
Jayamma Panchayathi releasing world wide tomorrow. Feeling little anxious but I believe that you all are going to go watch the movie in theatres and will be seeing a beautiful village drama. (1/2) pic.twitter.com/MThJaIaxej
— Jayamma (@ItsSumaKanakala) May 5, 2022




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























