
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 114


ఫ్యామిలీతో వెకేషన్.. ఎంజాయ్ మెంట్ లో బన్నీ..!
'ఆర్ నారాయణ మూర్తి' కి మాతృవియోగం

ఫ్రాంచైజీగా "బింబిసార"మూవీ - కళ్యాణ్ రామ్

'రాకెట్రీ' పై సూపర్ స్టార్ ప్రశంసలు..!

'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ రిలీజ్

'బింబిసార' ట్రైలర్ రిలీజ్..!

'లాఠీ' షూటింగ్.. మరోసారి గాయపడ్డ 'విశాల్'

సాయి పల్లవి "గార్గి" మూవీ రిలీజ్ డేట్

'నవీన్ చంద్ర' సినిమాకు క్రేజీ టైటిల్..!

శ్రీవిష్ణు 'అల్లూరి' టీజర్ రిలీజ్..!

లారెన్స్ "రుద్రుడు" మూవీ రిలీజ్ డేట్

'హరిహర వీరమల్లు' పవన్ సింగిల్ షెడ్యూల్ ప్లాన్..!

మెగా ఫ్యాన్స్ కు తమన్నా ప్రామిస్..!
రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.

ఫ్యామిలీతో వెకేషన్.. ఎంజాయ్ మెంట్ లో బన్నీ..!
టాలీవుడ్ హీరోల్లో కొంతమందికి సినిమా అయిపోయిన తరువాత ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లే అలవాటు ఉంటుంది. అలాంటివారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ముందే ఉంటుంది. అల్లు అర్జున్ ఫ్యామిలీ పర్సన్ అని అందరికీ తెలిసిందే. షూటింగ్స్ లేకపోతే ఎక్కువగా ఫ్యామిలీతోనే గడుపుతుంటాడు. ఇక తన పిల్లలు స్వీట్ మూమెంట్స్ ను, అల్లరిని అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటాడు. ప్రస్తుతం అయితే బన్నీ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి ఆఫ్రికాకి వెకేషన్‌కు వెళ్లాడు. దీనిలో భాగంగానే తను ఫ్యామిలితో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరలు అవుతుంది.
'ఆర్ నారాయణ మూర్తి' కి మాతృవియోగం
సినీ ఇండస్ట్రీలో విషాదాలు మాత్రం ఆగడంలేదు. గత రెండేళ్ల నుండి ఇండస్ట్రీలో మరీ ఎక్కువగా విషాద ఘటనలు చోటుచేసుకోవడం చూస్తున్నాం. యంగ్ హీరోల దగ్గర నుండి సీనియర్ల వరకూ ఎంతో మంది సినీ సెలబ్రిటీలు మరణించారు. రీసెంట్ గానే మీనా భర్త అయిన విద్యా సాగర్ కన్ను మూసిన ఘటన చోటుచేసుకుంది. ఇక ఇప్పుడు మరో విలక్షణ నటుడికి మాతృవియోగం కలిగింది. పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి ఇంట విషాదం నెలకొంది. నేడు ఆయన మాతృమూర్తి రెడ్డి చిట్టెమ్మ తుదిశ్వాస విడిచారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేటలో మరణించారు. రేపు ఉదయం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో ఆర్ నారాయణమూర్తి కుటుంబానికి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు…

'థాంక్యూ'.. చైతు పై బీవీఎస్ రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటంతో ఈసినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే కదా. ఫైనల్ గా జులై 22న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో చైతు వరుస హిట్స్ అందుకోవడంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యాన్స్ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఫ్రాంచైజీగా "బింబిసార"మూవీ - కళ్యాణ్ రామ్
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'రాకెట్రీ' పై సూపర్ స్టార్ ప్రశంసలు..!
తమిళ్ స్టార్ హీరో మాధవన్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకూ ఎన్నో డిఫరెంట్ కథలతో అలరించారు. ఇక మాధవన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. సఖి సినిమాతో తెలుగుప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అప్పుడప్పుడు తెలుగులో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తు మెప్పిస్తున్నాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాధవన్ దర్శకత్వంలో రాకెట్రీ. ది నంబి ఎఫెక్ట్ అన్న సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ అయిన "పక్కా కమర్షియల్"
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ జులై 1 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ పొందినా కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. హీరో గోపీచంద్ ఈ చిత్రం లో చాలా స్టైలిష్ గా, హ్యాండ్ సమ్ గా కనిపిస్తూ , తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ లో హీరోయిన్ రాశీఖన్నా తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో గోపీచంద్ , రాశీఖన్నా ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ రిలీజ్
మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను జరుపుకుంటుండగా దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఇక ఈసినిమా సంబంధించిన ఫస్ట్ లుక్ అప్ డేట్ రెండు రోజుల క్రితమే ఇచ్చారు. అప్పటినుండి ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ పోస్టర్లో నల్ల కళ్లద్దాలు ధరించి ఆయన లుక్ హుందాగా .. గంభీరంగా కనిపిస్తోంది. గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ వీడియోను హీరో రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో నల్ల…

'బింబిసార' ట్రైలర్ రిలీజ్..!
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందులో భాగంగా వస్తున్న సినిమానే బింబిసార. సోషియోఫాంటసీ నేపథ్యంలో వస్తున్న సినిమా ఇది. ఇప్పటివరకూ చేయని జోనర్ లో మొదటిసారి కళ్యాణ్ రామ్ చేస్తున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను కూడా కళ్యాణ్ రామ్ చాలా సైలెంట్ గానే స్టార్ట్ చేసేశాడు. అంతే సైలెంట్ గా పూర్తిచేస్తున్నాడు. ఇక మరోవైపు అప్పుడప్పుడు అప్ డేట్స్ కూడా ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్ నే సొంతంచేసుకుంది.

కింగ్ నాగార్జున సినీ కెరీర్ లో ఎవర్ గ్రీన్ మూవీ "గీతాంజలి"
సక్సెస్ ఫుల్ "విక్రమ్ "(1986 ) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నాగార్జున తెలుగు , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున హీరోగా తెరకెక్కిన "శివ ", "హలో బ్రదర్ ", "నిన్నే పెళ్లాడతా ", "అన్నమయ్య ","మన్మథుడు ", "నేనున్నాను ", "మనం ", "సోగ్గాడే చిన్నినాయనా", "బంగార్రాజు " వంటి మూవీస్ పలు రికార్డ్స్ క్రియేట్ చేశాయి. 100 చిత్రాలకు చేరువలో ఉన్న నాగార్జున ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ "ది ఘోస్ట్ "మూవీ లో నటిస్తున్నారు. కింగ్ నాగార్జున సినీ కెరీర్ లో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గా "గీతాంజలి"మూవీ నిలిచింది.

'హ్యాపీ బర్త్ డే'.. పార్టీ సాంగ్ రిలీజ్..!
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హ్యాపీ బర్త్ డే. ఇక ఈసినిమా ముందే రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి వరుస అప్ డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ రిలీజ్ అవ్వగా అన్నీ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి పాటలు కూడా రిలీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి పార్టీ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఏదో మైకంలో తేలిపోతుంటే.. తూలిపోతుంటే’ అంటూ సాగిన ఈ సాంగ్ చాలా బాగుంది…

రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో మెగా స్టార్ చిరంజీవి కి అభిమానుల ఘనస్వాగతం
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు భీమవరంలో జరగనున్న విషయం తెలిసిందే.భీమవరంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్న అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొంటారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న చిరంజీవికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున మెగా అభిమానులు అక్కడికి తరలివచ్చారు.చిరంజీవి కి అభిమానులు భారీ గజ మాలతో వెల్‌కమ్ చెప్పారు. ఈ క్రమంలోనే చిరంజీవి వారిని అభివాదం చేస్తూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. చిరంజీవి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భీమవరం చేరుకుంటారు.

సత్యదేవ్ "కృష్ణమ్మ" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
విభిన్న కథా చిత్రాల్లో నటిస్తూ నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకుని ప్రేక్షకుల్లో మంచి ఆధరణ సొంతం చేసుకున్న హీరో సత్యదేవ్ కథానాయకుడిగా మరో మూవీ తెరకెక్కుతుంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై గోపాల కృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా యాక్షన్ డ్రామా "కృష్ణమ్మ "మూవీ తెరకెక్కింది. కాలభైరవ సంగీతం అందించారు.

'లాఠీ' షూటింగ్.. మరోసారి గాయపడ్డ 'విశాల్'
విశాల్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు విశాల్. అందులో ఒక సినిమానే ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న లాఠీ.యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ చిత్రంలో విశాల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. అంతేకాదు రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఆగష్ట్ 12న ఈసినిమాను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

సాయి పల్లవి "గార్గి" మూవీ రిలీజ్ డేట్
బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన ”లవ్ స్టోరీ“, “శ్యామ్ సింగరాయ్” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

'నవీన్ చంద్ర' సినిమాకు క్రేజీ టైటిల్..!
టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో నవీన్ చంద్ర కూడా విభిన్నమైన పాత్రలు చేయడంలో ముందుంటాడు. నిజానికి నవీన్ చంద్ర కూడా ఏ పాత్రలో అయినా ఒదిగిపోయి నటించగలిగే టాలెంట్ ఉన్న నటుడు. అయితే అందాల రాక్షసి తరువాత తను హీరోగా చేసిన సినిమాలు పెద్దగా ఏమి విజయాన్ని అందించలేకపోయాయి. అయినా కూడా ధైర్యంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక మధ్య మధ్యలో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా కనిపిస్తున్నాడు. రీసెంట్ గానే విరాట పర్వం సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు.

శ్రీవిష్ణు 'అల్లూరి' టీజర్ రిలీజ్..!
ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో శ్రీవిష్ణు ఎప్పుడూ ముందుంటాడు. రీసెంట్ గా భళా తందనాన సినిమాతో మెప్పించిన శ్రీవిష్ణు ఇప్పుడు మరో సినిమాను రెడీ చేస్తున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా అల్లూరి. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా. తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

"మాచర్ల నియోజక వర్గం"మూవీ లో అంజలి స్పెషల్ సాంగ్
రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ ఆగస్ట్ 12వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

లారెన్స్ "రుద్రుడు" మూవీ రిలీజ్ డేట్
డ్యాన్సర్ గా పరిచయం అయిన రాఘవ లారెన్స్ , కొరియోగ్రాఫర్ గా మారి పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. హీరోగా , దర్శకుడిగా తెలుగు , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన లారెన్స్ ప్రస్తుతం నటన పై ఫోకస్ పెట్టారు. హారర్ కామెడీ మూవీస్ కు లారెన్స్ పెట్టింది పేరు గా మారిన లారెన్స్ ప్రస్తుతం “రుద్రన్ “, “అధికారం “మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు."చంద్రముఖి 2 "మూవీ కి లారెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'హరిహర వీరమల్లు' పవన్ సింగిల్ షెడ్యూల్ ప్లాన్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల కాలం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో పవన్ రాబిన్ హుడ్ తరహా బందిపోటు పాత్రలో కనిపించబోతున్నారని ఎప్పుటినుండో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ దశలో ఉంది. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.