శ్రీవిష్ణు ‘అల్లూరి’ టీజర్ రిలీజ్..!

Sree Vishnu Alluri Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Alluri,Alluri Movie,Alluri Telugu Movie,Alluri Movie Updates,Alluri latest Movie Updates,Alluri Teaser,Alluri Movie Telugu Teaser,Alluri latest Teaser Updates, Alluri Teaser Released,Sree Vishnu Alluri Movie,Sree Vishnu Upcoming Movie Alluri latest Updates,Sree Vishnu latest Movie Alluri Teaser Out Now,Sree Vishnu,Actor Sree Vishnu,Hero Sree Vishnu

ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో శ్రీవిష్ణు ఎప్పుడూ ముందుంటాడు. రీసెంట్ గా భళా తందనాన సినిమాతో మెప్పించిన శ్రీవిష్ణు ఇప్పుడు మరో సినిమాను రెడీ చేస్తున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా అల్లూరి. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా. తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ‘అల్లూరి’ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈసినిమాలో శ్రీవిష్ణు మొదటిసారి పోలీస్ పాత్రలో అలానే మాస్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్.. పోలీస్ బయలుదేరాడురా అంటూ మొదలైన టీజర్ విప్లవానికి నాంది చైతన్యం, చైతన్యానికి పునాది నిజాయితీ,నిజాయితీకి మారుపేరు అల్లూరి అంటూ ఈ టీజర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో సాగింది. చివర్లో శ్రీ విష్ణు పవర్ ఫుల్ గా అల్లూరి సీతారామరాజు సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ అని చెప్పడం హైలెట్ గా నిలిచింది.

కాగా కయ్యదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర, పృధ్వీ రాజ్, రవివర్మ, మధుసూధన్ రావు, జయవాణి తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. యాక్షన్ ఎమోష‌న‌ల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాను ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించ‌నున్నారు. ఈ సినిమాకు హ‌ర్షవ‌ర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా.. శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఈసినిమాను కూడా ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 15 =