పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల కాలం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో పవన్ రాబిన్ హుడ్ తరహా బందిపోటు పాత్రలో కనిపించబోతున్నారని ఎప్పుటినుండో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అయితే షూటింగ్ దశలో ఉంది. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమా షూటింగ్ కు అనుకోకుండా ఏదో ఒకరకంగా బ్రేక్ వస్తూనే ఉంది. ఎప్పుడో మొదలుపెట్టినా కూడా ఇంకా షూటింగే పూర్తి కాలేదు. కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ ఆగిపోగా అన్ని సినిమాలు మొదలైనా కూడా ఈసినిమా మాత్రం మొదలుపెట్టలేదు. చాలా గ్యాప్ తరువాత ఇటీవలే మళ్లీ రీస్టార్ట్ చేశారు. ఆమధ్య షూటింగ్ మొదలుపెట్టిన నేపథ్యంలో పవన్ యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించి రిహార్సల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో సూపర్ గా వైరల్ అయింది. ఇక శరవేగంగా షూటింగ్ ముగించుకుంటుంది అనుకునే లోపు మళ్లీ షూటింగ్ కు బ్రేక్ పడింది.
పవన్ ఒకవైపు రాజకీయాలతో కూడా బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ చాలా స్లోగా సాగుతుంది. అటు రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా అనుకున్న సమయానికి షూట్ ను కంప్లీట్ చేసుకోలేకపోతుంది. ఈనేపథ్యంలోనే ఈ సినిమా కోసం పవన్ వచ్చే నెల దాదాపు ఈసినిమాకే కేటాయించనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు.. మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ ను మొత్తం సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేయమని క్రిష్ కు చెప్పినట్టు సమాచారం. మరి చూద్దాం పవన్ ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో.
కాగా ఈసినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా అర్జున్ రాంపాల్ కూడా ఓ కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: