‘లాఠీ’ షూటింగ్.. మరోసారి గాయపడ్డ ‘విశాల్’

Vishal Gets Injured While Laththi Movie Shoot,Vishal Got Injured On The Sets Of His Upcoming Movie,Laththi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vishal,Hero Vishal,Vishal latest News,Vishal latest Movie Updates,Vishal Injured,Vishal Latest Injurey Updates,Vishal Got Injured in Shooting, Vishal Got Injured on the Sets,Vishal Health Condition,Vishal Upcoming Movies,Vishal New Movie Updates,Vishal latest Upcoming Movie Updates,Vishal Laththi,Laththi Movie,Laththi New Movie,Laththi upcoming Movie of Vishal

విశాల్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు విశాల్. అందులో ఒక సినిమానే ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న లాఠీ.యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ చిత్రంలో విశాల్ పోలీస్ అధికారిగా న‌టిస్తున్నాడు. అంతేకాదు రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఆగష్ట్ 12న ఈసినిమాను విడుద‌ల చేస్తున్నట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ సమయంలో గతంలో ఒకసారి విశాల్ గాయపడిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత షూటింగ్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఇక తాజాగా మరోసారి విశాల్ గాయపడ్డాడు. ప్రస్తుతం చిత్రయూనిట్ ఈసినిమా క్లైమాక్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ లో విశాల్ కాలికి గాయ‌మైంది. దాంతో చిత్ర‌యూనిట్ వెంట‌నే షూటింగ్‌ నిలిపివేసింది. విశాల్ కోలుకున్న త‌ర్వాత త‌దుప‌రి షూటింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

కాగా రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ నందా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈసినిమాలో హీరోయిన్ గా సునయన నటిస్తుంది. బాలసుబ్రమణ్యన్ సినిమాటోగ్రాఫర్ గా, సామ్ సిఎస్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =