మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను జరుపుకుంటుండగా దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఇక ఈసినిమా సంబంధించిన ఫస్ట్ లుక్ అప్ డేట్ రెండు రోజుల క్రితమే ఇచ్చారు. అప్పటినుండి ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ పోస్టర్లో నల్ల కళ్లద్దాలు ధరించి ఆయన లుక్ హుందాగా .. గంభీరంగా కనిపిస్తోంది. గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ వీడియోను హీరో రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో నల్ల కళ్లద్దాలు ధరించి, జేబులో పెన్ను పెట్టుకుని చిరు హుందాగా కనిపిస్తున్నారు. తన హెయిర్, వాకింగ్ స్టైల్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు. అంతేకాదు ఫస్ట్ లుక్ వీడియోలో సునీల్ కూడా కనిపిస్తున్నారు. థమన్ బీజియం సూపర్. ప్రస్తుతం ఈపోస్టర్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
THE #GodFather has arrived !! #GodFatherFirstLook : https://t.co/PYxtK9MCE5@KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @AlwaysRamCharan @ProducerNVP @SuperGoodFilms_ @KonidelaPro @saregamasouth pic.twitter.com/DQulIAsMWX
— Ram Charan (@AlwaysRamCharan) July 4, 2022
కాగా ఈసినిమాలో నయనతార, టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా డివోపీ హ్యాండిల్ చేస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: