డ్యాన్సర్ గా పరిచయం అయిన రాఘవ లారెన్స్ , కొరియోగ్రాఫర్ గా మారి పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. హీరోగా , దర్శకుడిగా తెలుగు , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన లారెన్స్ ప్రస్తుతం నటన పై ఫోకస్ పెట్టారు. హారర్ కామెడీ మూవీస్ కు లారెన్స్ పెట్టింది పేరు గా మారిన లారెన్స్ ప్రస్తుతం “రుద్రన్ “, “అధికారం “మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.”చంద్రముఖి 2 “మూవీ కి లారెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కదిరేశన్ సమర్పణలో ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఎస్ కదిరేశన్ దర్శకత్వంలో లారెన్స్ , ప్రియా భవానీ శంకర్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “రుద్రన్ ” తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తలిసిందే. ఈ మూవీ లో శరత్ కుమార్ విలన్ గా నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ”రుద్రన్” ప్రీ లుక్ , ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తెలుగు లో ఈ మూవీ “రుద్రుడు” టైటిల్ తో రిలీజ్ కానుంది. ఇప్పటికే 90 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది . “రుద్రన్ “మూవీ తమిళ , తెలుగు, మలయాళ , కన్నడ భాషలలో రిలీజ్ కానుంది. జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.”రుద్రుడు”మూవీని డిసెంబర్ 23 న థియేటర్ల ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ మూవీ పై అంచనాలను పెంచింది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: