తమిళ్ స్టార్ హీరో మాధవన్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకూ ఎన్నో డిఫరెంట్ కథలతో అలరించారు. ఇక మాధవన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. సఖి సినిమాతో తెలుగుప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అప్పుడప్పుడు తెలుగులో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తు మెప్పిస్తున్నాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాధవన్ దర్శకత్వంలో రాకెట్రీ. ది నంబి ఎఫెక్ట్ అన్న సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈసినిమా రూపొందించారు. పాకిస్థాన్ కు గూఢచార్యం చేస్తున్నాడన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన ఆయన ఎన్నో ఏళ్ల తరువాత నిర్దోషిగా నిరూపించబడి బయటకు వచ్చారు. ఆ తరువాత మళ్లీ ఇస్రో శాస్త్రవేత్తగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నారు అన్న నేపథ్యంలో ఈసినిమాను తీశారు. ఇక ఈసినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా చూసినవారు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈసినిమాపై అలానే మాధవన్ పై ప్రశంసలు కురిపించారు. రాకెట్రీ సినిమా తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా అని.. ముఖ్యంగా యువత చూడాలని.. దర్శకుడిగా మొదటి సినిమాతోనే ఉత్తమ దర్శకులతో సమానంగా నిరూపించుకున్నారని మాధవన్ ను కొనియాడాడు.
ఇక ఈసినిమాలో సిమ్రాన్ ఫీమేల్ లీడ్ లో నటించగా.. రజిత్ కపూర్, మిషా ఘోషల్, రవి రాఘవేంద్ర, గుల్షన్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. షారుఖ్ ఖాన్, సూర్య అతిధి పాత్రల్లో నటించిన ఈసినిమాను త్రికలర్ ఫిలిమ్స్, వర్గీస్ మూలన్ పిక్చర్స్ బ్యానర్స్ పై నిర్మించారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: