రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ ఆగస్ట్ 12వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజకీయ అంశాలతో కూడిన పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న “మాచర్ల నియోజకవర్గం ” మూవీ పోస్టర్‌లు, గ్లింప్స్ కు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అంజలి ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కై ఎంపిక అయ్యారు. ఆ విషయాన్ని తెలియ జేస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.”సరైనోడు ” మూవీ లో అల్లు అర్జున్ తో స్పెషల్ సాంగ్ తో అంజలి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో నితిన్ తో తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అంజలి ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: