విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటంతో ఈసినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే కదా. ఫైనల్ గా జులై 22న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో చైతు వరుస హిట్స్ అందుకోవడంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యాన్స్ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాపై తాజాగా బీవీఎస్ రవి చేసిన కామెంట్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి. ఈసినిమా ఫైనల్ కట్ చూసిన రవి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. థాంక్యూ సినిమా ఫైనల్ కట్ చూశాను.. చై ఫ్యాన్స్ అందరికీ నేను హామీ ఇస్తున్నాను.. అభిరామ్ పాత్రలో చైతు కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు.. ఖచ్చితంగా మీకు మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది ఈసినిమా అని తెలిపాడు.
Just watched the final cut of #ThankYouTheMovie and I can vouch to all the fans of @chay_akkineni that his role of AbhiRam’s is his best till date as an actor and it’s going to be an awestruck experience for all of us ❤️🤗👍👏👏
— BVS Ravi (@BvsRavi) July 5, 2022
ఈసినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. అవికా గోర్,మాళవిక నాయర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: