మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ జులై 1 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ పొందినా కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. హీరో గోపీచంద్ ఈ చిత్రం లో చాలా స్టైలిష్ గా, హ్యాండ్ సమ్ గా కనిపిస్తూ , తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ లో హీరోయిన్ రాశీఖన్నా తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో గోపీచంద్ , రాశీఖన్నా ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పక్కా కమర్షియల్”మూవీ కై పబ్లిసిటీతో కలుపుకొని దాదాపు రూ. 35 కోట్లకు పైగా మేకర్స్ ఖర్చు పెట్టారనీ , అందులో 32 కోట్లు కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ (డిజిటల్, శాటిలైట్, హిందీ రీమేక్, డబ్బింగ్ అన్ని) రూపంలోనే వచ్చాయనీ సమాచారం. మొదటి రోజు రూ. 6.3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన “పక్కా కమర్షియల్”, మూడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా 15. 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి , బ్రేక్ ఈవెన్ అవడం విశేషం.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: