లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హ్యాపీ బర్త్ డే. ఇక ఈసినిమా ముందే రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి వరుస అప్ డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ రిలీజ్ అవ్వగా అన్నీ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి పాటలు కూడా రిలీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి పార్టీ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఏదో మైకంలో తేలిపోతుంటే.. తూలిపోతుంటే’ అంటూ సాగిన ఈ సాంగ్ చాలా బాగుంది. ఈపాటను దామిని భట్ల పాడగా.. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. ఇక సాంగ్ లోని విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Prati party lo inka ide song 🥳🎶#PartySong from #HBDMovie out now
– https://t.co/BgqEsqd4X8#HappyBirthday #HBDMovieOnJuly8@Itslavanya @RiteshRana @vennelakishore @nareshagastya #Satya @kaalabhairava7 @ClapEntrtmnt @SonyMusicSouth pic.twitter.com/zKnJqVDsdF— Mythri Movie Makers (@MythriOfficial) July 4, 2022
కాగా ఈసినిమాలో నరేష్ అగస్త్య కూడా నటించాడు. ఈసినిమాలో ఇంకా సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ – క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ల పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తుండగా సురేష్ సరంగం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈసినిమా జులై8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: