‘నవీన్ చంద్ర’ సినిమాకు క్రేజీ టైటిల్..!

Crazy Title For Naveen Chandra Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Naveen Chandra,Hero Naveen Chandra,Naveen Chandra Movie Update,Naveen Chandra Latest Movie Updates,Naveen Chandra Upcoming Movies,Naveen Chandra New Movie, Naveen Chandra New Movie Title Month of Madhu,Naveen Chandra Upcoming Movie Name Titled Month of Madhu,Month of Madhu Movie,Month of Madhu Telugu Movie

టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో నవీన్ చంద్ర కూడా విభిన్నమైన పాత్రలు చేయడంలో ముందుంటాడు. నిజానికి నవీన్ చంద్ర కూడా ఏ పాత్రలో అయినా ఒదిగిపోయి నటించగలిగే టాలెంట్ ఉన్న నటుడు. అయితే అందాల రాక్షసి తరువాత తను హీరోగా చేసిన సినిమాలు పెద్దగా ఏమి విజయాన్ని అందించలేకపోయాయి. అయినా కూడా ధైర్యంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక మధ్య మధ్యలో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా కనిపిస్తున్నాడు. రీసెంట్ గానే విరాట పర్వం సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా నవీన్ చంద్ర హీరోగా మరో సినిమా వస్తుంది. శ్రీకాంత్ దర్శకత్వంలో నవీన్ చంద్ర హీరోగా ఒక సినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా
ఈసినిమాకు క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేశారు. మంత్ ఆఫ్ మధు అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. అంతేకాదు ఈసందర్భంగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.Crazy Title For Naveen Chandra Movie

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో భానుమతి రామకృష్ణ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అయింది. అంతేకాదు ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు రెండో సినిమా వస్తుంది ఈసినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

ఈసినిమాలో కలర్స్ స్వాతి ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. శ్రేయ నవేలి, హర్ష చెముడు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అచు రాజమణి సంగీతం అందిస్తున్న ఈసినిమాను యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు సంబంధించిన టీజర్ అప్ డేట్ ఇంకా రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ త్వరలో ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =