కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2021

ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 92

రిలీజ్ అప్‌డేట్

"గని " రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , బ్లూ వాటర్ క్రియేటివ్స్ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "గని " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ మూవీ “దబంగ్ “ఫేమ్ సాయీ మంజ్రేకర్ కథానాయిక కాగా ఉపేంద్ర , సునీల్ శెట్టి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లోని తన క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో శిక్షణ పొందారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

రాజమౌళి నిర్ణయం పై బోనీ కపూర్ అసహనం..!

దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి. రాజమౌళి దర్శకత్వం.. అందులోనూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి హీరోలు నటిస్తుండటం.. బాహుబలి సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడం ఇక ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు రాజమౌళి. అక్టోబర్ 13 న దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కోల్ మైన్స్ లో "సలార్ "యాక్షన్ సీన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పీరియాడికల్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "రాధేశ్యామ్ "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ తరువాత నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీ , ఓం రౌత్ "ఆదిపురుష్ ", ప్రశాంత్ నీల్ "సలార్ "మూవీ కి హీరో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీస్ అన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వెర్సటైల్ యాక్ట్రెస్ లావణ్య త్రిపాఠి

మోడల్ , డ్యాన్సర్ , మిస్ ఉత్తరాఖండ్ లావణ్య త్రిపాఠి "అందాల రాక్షసి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి "దూసుకెళ్తా ", "మనం ", "భలే భలే మొగాడివోయ్ ", సోగ్గాడే చిన్ని నాయనా ""అర్జున్ సురవరం"వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరించారు. సోషల్ మీడియా లో తన వర్కౌట్ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ లావణ్య అభిమానులను ఆకట్టుకుంటున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను లావణ్య ఎంపిక చేసుకుంటున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Samantha Akkineni Reveals About Her Best Memory in 2020,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha Akkineni,Heroine Samantha Akkineni,Actress Samantha Akkineni,Naga Chaitany
సినిమా వార్తలు

2020 సమంత బెస్ట్ మెమొరీ

సోషల్ మీడియా క్వీన్ ఎవరంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు సమంత. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటూనే ఉంటుంది. అంతేకాదు అభిమానులతో కూడా ముచ్చటిస్తూ వారికి దగ్గరగా ఉంటుంది. ఇక పెళ్ళైన తర్వాత కూడా సామ్ అసలు ఏమాత్రం తగ్గకుండా పలు ఫొటోలు పోస్ట్ చేస్తూనే ఉంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"అంధాధున్ "మలయాళ రీమేక్ ప్రారంభం

తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రాశీఖన్నా , ప్రస్తుతం 3 తమిళ మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఒక తమిళ వెబ్ సిరీస్ “అంధాధున్ “మలయాళ రీమేక్ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. ఒక మూవీ లో రాశీఖన్నా , సాయి తేజ్ కు జోడీగా ఎంపిక అయ్యారనీ , ఒక హిందీ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.రాశీఖన్నా తన లేటెస్ట్ ఫొటో షూట్ ఫొటోస్ , వర్కౌట్ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

'సన్ ఆఫ్ ఇండియా' నుండి రానున్న ఫస్ట్ లుక్

రత్నబాబు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో సన్ ఆఫ్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్ళింది. అయితే కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే షూటింగ్ ను మళ్లీ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా నుండి టైటిల్ పోస్టర్ అప్ డేట్ తప్పా ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు.

TFN Adminవాట్సాప్
Tollywood Star Hero To Give Voice Over For Acharya Movie Teaser,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Charan Voice Over For Acharya Teaser,Tollywood Star Hero Voice Over For
ట్రైలర్ & టీజర్

'ఆచార్య' టీజర్ కు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!

ఆచార్య టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ ఈ రోజు ఉదయాన్నే మెగా అభిమానులకు కొరటాల సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ఫ్యాన్స్ 29 కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇంకా ఆ సంతోషంలో ఉండగానే ఇప్పుడు మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ విషయాన్ని ఎవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా బయట పెట్టడంతో ఇప్పుడు ఈ విషయం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. ఆచార్య టీజర్ లో చరణ్ అన్న వాయిస్ ఓవర్ అంటగా... అహా బయట టాకు' అంటూ బ్రహ్మానందం ఫొటోతో ఉన్న ఒక మీమ్ ను పోస్ట్ చేసాడు. మరి స్వయంగా వరుణే ఈ ట్వీట్ చేయడంతో ఇది నిజమే అన్న అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

"ఖిలాడి " ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

హీరో రవితేజ ప్రస్తుతం ఎ స్టూడియోస్ , పెన్ మూవీస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ "రాక్షసుడు "మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హీరో రవితేజ ద్విపాత్రాభినయం తో తెరకెక్కుతున్న “ఖిలాడి “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “క్రాక్ ” మూవీ ఘనవిజయం సాధించడం తో హీరో రవితేజ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'సందీప్ కిషన్' కొత్త సినిమా ప్రారంభం

ఒక సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాను లైన్ లో పెడుతూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సందీప్ కిషన్. ఇటీవలే A1 ఎక్స్ ప్రెస్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

"లవ్ స్టోరీ " రిలీజ్ డేట్ ఫిక్స్

ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఆహ్లాద భరిత ప్రేమ కథా చిత్రం “లవ్ స్టోరీ” రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ మూవీ లో దేవయాని , రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. హీరో నాగచైతన్య , సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న “లవ్ స్టోరీ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.“రాధేశ్యామ్ “మూవీ తరువాత హీరో ప్రభాస్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీ , ఓం రౌత్ మైథలాజికల్ “ఆదిపురుష్ “మూవీ , ప్రశాంత్ నీల్ గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్ “కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆస్కార్ బరిలో "ఆకాశం నీ హద్దురా !"

స్టార్ హీరో సూర్య , అపర్ణ బాలమురళి జంటగా 2D ఎంటర్ టైన్ మెంట్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన “సూరరై పోట్రు “(ఆకాశం నీ హద్దురా !) తమిళ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , పరేష్ రావల్ ముఖ్య పాత్రలలో నటించారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

"ఉప్పెన " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా రూపొందిన "ఉప్పెన " మూవీ ఫిబ్రవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. "ఉప్పెన " మూవీ తో హీరో సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ కు హీరోగా పరిచయమవుతున్నారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'ఆచార్య' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా స్టార్ నటిస్తున్న ఆచార్య సినిమా టీజర్ కోసం ఎంత మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా అయినా టీజర్ రిలీజ్ చేస్తారనుకున్నారు. కానీ టీజర్ రాలేదు. ఫైనల్లీ మెగా అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అప్ డేట్ అయితే వచ్చేసింది. ఆచార్య సినిమా టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేసి ప్రకటించారు డైరెక్టర్ కొరటాల. టీజర్ రిలీజ్ విషయంపై చిరు-కొరటాల మధ్య ఫన్నీ సంభాషణ జరిగినట్టు చిరు తన ట్వీట్ లో పోస్ట్ చేయగా దానిపై మెగా అభిమానులతో పాటు పలువురు హీరోలు కూడా కామెడీగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇక నేడు టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జనవరి 29వ తేదీన…

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

"A1 ఎక్స్ ప్రెస్" ట్రైలర్ రిలీజ్

సందీప్ కిషన్ , లావణ్య త్రిపాఠి జంటగా హాకీ గేమ్ నేపథ్యం లో వెంకటాద్రి టాకీస్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “A1 ఎక్స్ ప్రెస్ ” మూవీ ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మురళీశర్మ , రావు రమేష్ , పోసాని , ప్రియదర్శి , రఘుబాబు ముఖ్య పాత్రలలో నటించారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మాస్ ఎంటర్ టైనర్ "పటాస్"

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ , శృతి సోధి జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "పటాస్ " మూవీ ఘనవిజయం సాధించింది.సాయి కుమార్ , అశుతోష్ రాణా , శ్రీనివాస రెడ్డి , ఎమ్ ఎస్ నారాయణ ముఖ్య పాత్రలో నటించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. "పటాస్" మూవీ తో అనిల్ రావిపూడి దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "పటాస్" మూవీ తమిళ , కన్నడ , బెంగాలీ భాషలలో రీమేక్ జరుపుకుని విజయం సాధించింది.

Team TFNవాట్సాప్
సాంగ్

'సర్కారు వారి పాట' ఖాతాలో మొదటి రికార్డ్

సూపర్ స్టార్ మహేష్ బాబుకు రికార్డ్స్ కొత్త కాదు. సినిమాల పరంగా కానీ.. సోషల్ మీడియా పరంగా కానీ ఒక్క విభాగంలో కాదు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. ఏదో ఒక రికార్డ్ క్రియేట్ చేస్తూనే ఉంటాడు. అయితే ఇప్పుడు మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'క్రైమ్ థ్రిల్ల‌ర్' గా న‌వీన్‌చంద్ర కొత్త సినిమా

అందాల రాక్ష‌సి సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయిన టాలెంటెడ్ హీరో న‌వీన్ చంద్ర. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అవి నిరాశనే మిగిల్చాయి. ఇక ఈ మ‌ధ్య విల‌న్ పాత్రల్లో కూడా నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇక ఇప్పుడు చాలా రోజుల త‌ర్వాత ఓ డిఫరెంట్ కథతో వస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అభిమానులకు నితిన్ సర్ ప్రైజ్

"భీష్మ "మూవీ ఘనవిజయం సాధించడంతో జోష్ లో ఉన్న నితిన్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే . భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ , రకుల్ ప్రీత్ , ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రలలోరూపొందిన థ్రిల్లర్ మూవీ "చెక్ " ఫిబ్రవరి 19 వ తేదీ రిలీజ్ కానుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తిసురేష్ జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "రంగ్ దే !" మూవీ మార్చి 26 వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్

షేర్