ఆచార్య టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ ఈ రోజు ఉదయాన్నే మెగా అభిమానులకు కొరటాల సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ఫ్యాన్స్ 29 కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇంకా ఆ సంతోషంలో ఉండగానే ఇప్పుడు మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ విషయాన్ని ఎవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా బయట పెట్టడంతో ఇప్పుడు ఈ విషయం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. ఆచార్య టీజర్ లో చరణ్ అన్న వాయిస్ ఓవర్ అంటగా… అహా బయట టాకు’ అంటూ బ్రహ్మానందం ఫొటోతో ఉన్న ఒక మీమ్ ను పోస్ట్ చేసాడు. మరి స్వయంగా వరుణే ఈ ట్వీట్ చేయడంతో ఇది నిజమే అన్న అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#AcharyaTeaser@KChiruTweets @AlwaysRamCharan https://t.co/ullSqm4bt1 pic.twitter.com/0rOCe3Pu0j
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) January 27, 2021
ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. ఇంకా రామ్ చరణ్ సిద్ద అనే ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్నఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఒకవైపు పూర్తి చేసుకుంటూ.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది మే లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: