మెగా స్టార్ నటిస్తున్న ఆచార్య సినిమా టీజర్ కోసం ఎంత మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా అయినా టీజర్ రిలీజ్ చేస్తారనుకున్నారు. కానీ టీజర్ రాలేదు. ఫైనల్లీ మెగా అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అప్ డేట్ అయితే వచ్చేసింది. ఆచార్య సినిమా టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేసి ప్రకటించారు డైరెక్టర్ కొరటాల. టీజర్ రిలీజ్ విషయంపై చిరు-కొరటాల మధ్య ఫన్నీ సంభాషణ జరిగినట్టు చిరు తన ట్వీట్ లో పోస్ట్ చేయగా దానిపై మెగా అభిమానులతో పాటు పలువురు హీరోలు కూడా కామెడీగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇక నేడు టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జనవరి 29వ తేదీన సాయంత్రం 4.5 నిమిషాలకు ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
The Doors to Dharmasthali will open on 29th Jan at 4:05 PM 🔥
– https://t.co/AufFZvzh7l#AcharyaTeaserOnJan29#Acharya
Mega Star @KChiruTweets @AlwaysRamCharan @sivakoratala @MsKajalAggarwal #ManiSharma @DOP_Tirru @NavinNooli @sureshsrajan #NiranjanReddy @KonidelaPro pic.twitter.com/SCvcIbZIX7
— Matinee Entertainment (@MatineeEnt) January 27, 2021
ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ షూటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ తర్వాత ఆచార్య షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్నఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఒకవైపు పూర్తి చేసుకుంటూ.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది మే లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























