‘సర్కారు వారి పాట’ ఖాతాలో మొదటి రికార్డ్

Sarkaru Vaari Paata Creates New World Record in Twitter,Mahesh Babu’s Sarkaru Vaari Pataa Creates A New Record On Twitter,Mahesh Babu’s Sarkaru Vaari Paata Movie Begins Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata Telugu Movie Latest News,Sarkaru Vaari Paata Movie Shooting Updates,Sarkaru Vaari Paata Telugu Movie Shooting Latest News,Sarkaru Vaari Paata Shooting News,Superstar Mahesh Babu Sarkaru Vaari Paata Movie,Prince Mahesh Babu Sarkaru Vaari Paata Movie Live Updates,#SarkaruVaariPaata

సూపర్ స్టార్ మహేష్ బాబుకు రికార్డ్స్ కొత్త కాదు. సినిమాల పరంగా కానీ.. సోషల్ మీడియా పరంగా కానీ ఒక్క విభాగంలో కాదు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. ఏదో ఒక రికార్డ్ క్రియేట్ చేస్తూనే ఉంటాడు. అయితే ఇప్పుడు మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్ పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ ఈ రోజే దుబాయ్ లో మొదలైంది. సాధారణంగా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత రికార్డ్స్ క్రియేట్ చేయడం చూస్తాం కానీ.. ఈ సినిమా అప్పుడే సరికొత్త రికార్డు ను క్రియేట్ చేసింది. “సర్కారు వారి పాట” సినిమా హ్యాష్ ట్యాగ్ కొద్దికాలంగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు హ్యాష్‌ట్యాగ్ వంద మిలియ‌న్ మార్క్‌ను క్రియేట్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా ట్యాగ్ కూడా ఈ రేంజ్‌లో ట్రెండ్ అవ్వలేదు.

పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 20 రోజుల పాటు దుబాయ్‌లో తొలి షెడ్యూల్ చిత్రీక‌రించ‌నున్నారు. ఈ షెడ్యూల్ త‌ర్వాత హైద‌రాబాద్‌లో రెండో షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. మిగిలిన నటీనటులు ఇతర వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =