మోడల్ , డ్యాన్సర్ , మిస్ ఉత్తరాఖండ్ లావణ్య త్రిపాఠి “అందాల రాక్షసి “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి “దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మొగాడివోయ్ “, సోగ్గాడే చిన్ని నాయనా “”అర్జున్ సురవరం”వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరించారు. సోషల్ మీడియా లో తన వర్కౌట్ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ లావణ్య అభిమానులను ఆకట్టుకుంటున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను లావణ్య ఎంపిక చేసుకుంటున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



హీరోయిన్ లావణ్య కథానాయికగా హాకీ నేపథ్యంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “A1 ఎక్స్ ప్రెస్ ” మూవీ ఫిబ్రవరి లో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో హాకీ ప్లేయర్ గా నటించిన లావణ్య హాకీ లో ప్రత్యేక శిక్షణ పొందారు. హీరో కార్తికేయ కథానాయకుడిగా రూపొందుతున్న మాస్ ఎంటర్ టైనర్ “చావుకబురు చల్లగా” మూవీ లో లావణ్య కథానాయికగా నటిస్తున్నారు. ఈ మూవీ లో నటనకు స్కోప్ ఉన్న నర్స్ గా ఒక డీ గ్లామర్ పాత్రలో నటిస్తున్నారు. వైవిధ్య భరిత పాత్రలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న లావణ్య కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: