ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 93
జిమ్ లో రవితేజ ఎంజాయ్

30 ఏళ్ల తర్వాత 'గ్యాంగ్ లీడర్ బ్రదర్స్'
పవన్-రానా సినిమా కూడా షురూ
డబుల్ రోల్స్ మూవీస్ లో మమ్ముట్టి రికార్డ్
"గాలి సంపత్ "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ ఫిక్స్
కియారా అద్వానీ ఫ్రెష్ లుక్
'జాతి రత్నాలు' రిలీజ్ డేట్ ఖరారు
ప్రకృతి ఒడిలో రాశీఖన్నా వర్కౌట్
'అక్షర' రిలీజ్ డేట్ ఫిక్స్
రవితేజ 'ఖిలాడి' నుండి రానున్న ఫస్ట్ గ్లింప్స్
పెట్ డాగ్ తో విజయ్ దేవరకొండ
మెగా ఫర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫొటో

'కొత్తబంగారు లోకం' నుండి శ్వేతా బసు కామెడీ సీన్
ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది - ప్రదీప్
శర్వానంద్ 'శ్రీకారం' రిలీజ్ డేట్ ఫిక్స్
లక్ష్ హీరోగా "గ్యాంగ్ స్టర్ గంగరాజు" - షూటింగ్ ప్రారంభం
పూజాహెగ్డే ట్విట్టర్ రికార్డ్
స్టార్ హీరోలతో పాటు యువ హీరోలకు జోడీగా నటిస్తూ పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్”మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ను పూజాహెగ్డే కంప్లీట్ చేసారు. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న తెలుగు మూవీ , బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ “కభీ ఈద్ కభీ దివాలీ “, రణ్ వీర్ సింగ్ “సర్కస్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.
సాయితేజ్ కొత్త సినిమా ‘రిపబ్లిక్’ మోషన్ పోస్టర్ రిలీజ్
‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాల తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సాయి తేజ్ ప్రస్తుతం దేవ కట్టా తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. రేపు రిపబ్లిక్ డే కావడంతో ఆసందర్భంగా ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు ‘రిపబ్లిక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
జిమ్ లో రవితేజ ఎంజాయ్
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ "మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో రవితేజ ప్రస్తుతం సూపర్ హిట్ "రాక్షసుడు"మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఖిలాడి " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న "ఖిలాడి " మూవీ శరవేగంగా తెరకెక్కుతుంది.

30 ఏళ్ల తర్వాత 'గ్యాంగ్ లీడర్ బ్రదర్స్'
చిరంజీవి సినీ ప్రయాణంలో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు ఉండగా వాటిలో గ్యాంగ్ లీడర్ సినిమా కూడా తప్పకుండా ఉంటుంది. చిరంజీవి హీరోగా నటించగా మురళీ మోహన్, తమిళ్ నటుడు శరత్ కుమార్ అన్నలుగా నటించారు. ఆ ముగ్గురి అన్నదమ్ముల అనుబంధం.. చిరు పర్ఫార్మెన్స్, విజయశాంతి తో కెమిస్ట్రీ చిరు-నిర్మలమ్మ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఎప్పటికీ మరచిపోలేము. ఇక బప్పీలహరి సంగీతం అందించిన ఈ సినిమాకు మరో హైలైట్. విజయ బాపినీడు దర్శకత్వంలో, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా 1991 లో మే న రిలీజై ఈ ఏడాది మే 9 కి 30 ఏళ్ళు పూర్తి చేసుకోనుంది.
పవన్-రానా సినిమా కూడా షురూ
సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియనుమ్' సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో రానా నటిస్తున్న సంగతి కూడా విదితమే. బిజు మీనన్ పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ చేస్తుండగా.. రానా పృథ్వీరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
డబుల్ రోల్స్ మూవీస్ లో మమ్ముట్టి రికార్డ్
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తన సక్సెస్ ఫుల్ సినీ కెరీర్ లో దక్షిణాది భాషలతో పాటు హిందీ , ఇంగ్లీష్ భాషలలో 400 మూవీస్ కు పైగా నటించి 4 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. "న్యూ ఢిల్లీ "(1987 ) మూవీ ఘనవిజయం సాధించడంతో మమ్ముట్టి తిరుగు లేని హీరోగా మారారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా మమ్ముట్టి 3 నేషనల్ , 7 కేరళ స్టేట్ , 13ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తో పాటు "పద్మశ్రీ "పురస్కారాన్ని అందుకున్నారు.
"గాలి సంపత్ "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి సమర్పణలో ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్ మెంట్స్ , షైన్ స్క్రీన్స్ బ్యానర్స్ పై అనీష్ దర్శకత్వంలో వైవిధ్య భరితచిత్ర కథా నాయకుడు శ్రీ విష్ణు , లవ్లీ సింగ్ జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "గాలి సంపత్" మూవీ మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11 వ తేదీ రిలీజ్ కానుంది. రాజేంద్ర ప్రసాద్ , తనికెళ్ళ భరణి , సత్య , రఘుబాబు ముఖ్య పాత్రలలో నటించారు. అచ్చు రాజమణి సంగీతం అందించారు.
'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ ఫిక్స్
మూడేళ్ల నిరీక్షణకు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల ఎదురచూపులకు ఫైనల్లీ ఈ రోజు కాస్త ఊరట కలిగించారు ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్. ఈ సినిమా గత రెండేళ్ల నుండి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. అసలే లేట్ అయింది అనుకుంటే కరోనా వల్ల మరింత లేట్ అయింది. ఇప్పుడు గ్యాప్ లేకుండా షూటింగ్ ను జరుపుతున్నారు. ఇటీవలే క్లైమాక్స్ షూటింగ్ జరుపుతున్నట్టు రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ లోపు రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ టీజర్ లను అయితే రిలీజ్ చేశారు. వాటికి మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చిందనుకోండి.
కియారా అద్వానీ ఫ్రెష్ లుక్
కియారా అద్వానీ గా పేరు మార్చుకున్న అలియా అద్వానీ కమర్షియల్ హిట్ "ఫగ్లీ "మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. సూపర్ హిట్ "ఎమ్ ఎస్ ధోని :ది అన్ టోల్డ్ స్టోరీ " మూవీ తో గుర్తింపు పొందారు. బ్లాక్ బస్టర్ "భరత్ అనే నేను "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి కియారా అద్వానీ తన అందం , అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన రెండవ మూవీ "వినయ విధేయ రామ "పరాజయం పొందడం తో కియారా టాలీవుడ్ కు దూరం అయ్యారు. కియారా కథానాయికగా నటించిన , సూపర్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ హిందీ రీమేక్ "కబీర్ సింగ్ "మూవీ ఘనవిజయం సాధించడం తో కియారా బాలీవుడ్ లో బిజీగా మారారు.
'జాతి రత్నాలు' రిలీజ్ డేట్ ఖరారు
అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో జాతి రత్నాలు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ తెలిసిందే కదా లాక్ డౌన్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోవడంతో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్.
'సర్కారు వారి పాట' షూటింగ్ మొదలు
మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు సర్కారు వారి పాట చిత్రయూనిట్. కరోనా వల్ల కొన్ని నెలలుగా షూటింగ్ లు మొత్తం ఆగిపోయాయి. ఎలాగొలా గత కొద్దికాలంగా షూటింగ్ లు మొదలవుతున్నాయి. అందరు హీరోలు సినిమా షూటింగ్ లు మొదలు పెట్టడంతో తమ హీరో ఎప్పుడు మొదలు పెడతాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. ఇప్పటికే చిత్రయూనిట్ దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఈ రోజునుండి ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు. దుబాయ్‌లో ఈ మూవీ షూటింగ్ అధికారికంగా మొదలైందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ది ఆక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్’ అనే క్యాప్షన్‌తో ట్వీటర్లో ఓ…
ప్రకృతి ఒడిలో రాశీఖన్నా వర్కౌట్
తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రాశీఖన్నా , ప్రస్తుతం 3 తమిళ మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఒక తమిళ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్ "మలయాళ రీమేక్ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో రూపొందనున్న మూవీ లో రాశీఖన్నా , సాయి తేజ్ కు జోడీగా ఎంపిక అయ్యారనీ , ఒక హిందీ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
'అక్షర' రిలీజ్ డేట్ ఫిక్స్
ఇప్పటికే పలు హార్రర్ సినిమాలతో భయపెట్టిన సినిమా నందిత శ్వేతా మరోసారి భయపెట్టడానికి రెడీ అవుతోంది. బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో ‘అక్షర’ అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. కొన్ని కారణాల వల్ల రిలీజ్ కు బ్రేక్ పడితే.. కరోనా వల్ల మొత్తానికే లాంగ్ గ్యాప్ వచ్చింది. ఇక ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి థియేటర్ లో రిలీజ్ చేయనున్నారు.
రవితేజ 'ఖిలాడి' నుండి రానున్న ఫస్ట్ గ్లింప్స్
క్రాక్ సినిమాతో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు రవితేజ. వరుస ప్లాప్స్ లో ఉన్న రవితేజకు ఈ సినిమా కాస్త మంచి జోష్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు రమేష్‌వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయగా మరోసారి హుషారైన పాత్రలో రవితేజ నటిస్తున్నట్టు కనిపిస్తుంది.
పెట్ డాగ్ తో విజయ్ దేవరకొండ
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "లైగర్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అనన్య పాండే కథానాయిక. ఈ మూవీ లో బాక్సర్ గా నటిస్తున్న విజయ్ , థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. ముంబై లో ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న "లైగర్ " మూవీ కరోనా కారణం గా నిలిచిపోయింది. ఇప్పుడు ముంబై లో మరో షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.
మెగా ఫర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫొటో
మెగా బ్రదర్ నాగబాబు తన ముద్దుల కూతురు నిహారిక పెళ్లి ఇటీవలే జరిపిన సంగతి తెలిసిందే కదా. వరుణ్ తేజ్ దగ్గరుండి చెల్లెలి పెళ్లి చాలా ఘనంగా జరిపించాడు. ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా మూడు రోజుల పాటు పెళ్ళి జరిగింది. ఇక ఆ తర్వాత నాగబాబు టీవీ షోస్ తో బిజీ అవ్వడం.. నిహారిక హానీమూన్ అత్తారింటికి వెళ్లడం.. ఇంకోవైపు వరుణ్ కు కరోనా రావడంతో అందరూ కలుసుకునే ఛాన్స్ లేకుండా పోయింది. ఇక ఇప్పుడు నిహారిక ఇంటికి వచ్చేసింది. వరుణ్ కూడా కోలుకున్నాడు. ఇక ఫ్యామిలీ రిలాక్డ్స్ మూడ్ లోకి వచ్చేసింది.

'కొత్తబంగారు లోకం' నుండి శ్వేతా బసు కామెడీ సీన్
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ సందేశ్, శ్వేతా బసు హీరో హీరోయిన్స్ గా వచ్చిన సినిమా కొత్త బంగారు లోకం. అప్పట్లో ఈ సినిమా యూత్ ఫుల్ సినిమా గా సంచలనమే సృష్టించింది అని చెప్పొచ్చు. మ్యూజికల్ గా కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాలో ఎకాడా.. అనే డైలాగ్‌తో పాపులర్ అయిపోయి వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది శ్వేతా. అనంతరం రైడ్, కల్వరి కింగ్, కాస్కో తదితర చిత్రాల్లో నటించి తెరమరుగైంది. ప్రస్తుతం సినిమాలకు దూరమైన ఈ బొద్దుగుమ్మ టీవీ సీరియల్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమానుండి శ్వేతా బసు కామెడీ సీన్ మీకోసం.
ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది - ప్రదీప్
మున్నా దర్శకత్వంలో ప్రదీప్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ కూడాఆగిపోయింది. మళ్లీ థియేటర్స్ ఓపెన్ కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇక మొదటినుండి ప్రదీప్ సినిమా కాబట్టి ఈ సినిమాకు హైప్ బాగానే వచ్చింది. ఇక ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్ ‘నీలి నీలి ఆకాశం’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఇటీవలే ప్రకటించారు. జనవరి 29న ఈ చిత్రం థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు..
శర్వానంద్ 'శ్రీకారం' రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి అయిపోయింది.. పలు సినిమాలు థియేటర్లలో సందడి చేసి వెళ్లిపోయాయి. ఇక ఫిబ్రవరికి చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో మరో సినిమా కూడా చేరిపోయింది. కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
లక్ష్ హీరోగా "గ్యాంగ్ స్టర్ గంగరాజు" - షూటింగ్ ప్రారంభం
వలయం వంటి డిఫరెంట్ థ్రిల్లర్ తో ఆకట్టుకున్న లక్ష్ఇప్పుడు మరో విభిన్నమైన కథతో రావడానికి సిద్దమయ్యాడు. ఇషాన్ సూర్య దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ గంగరాజు అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఈ రోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు షాట్ కు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు గారు క్లాప్ ఇచ్చారు.. ఈ రోజు నుండి హైదరాబాద్, అరకు, ప్రాంతాల్లో ఏకధాటిగా జరిగే రెండు షెడ్యూల్స్ లో షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఎవరూ ఊహించని కథతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చె లా " గ్యాంగ్ స్టర్ గంగరాజు" చిత్రాన్ని రూపొందుస్తున్నారు.