‘సందీప్ కిషన్’ కొత్త సినిమా ప్రారంభం

Actor Sundeep Kishan New Movie Launched In Style,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sundeep Kishan,Actor Sundeep Kishan,Hero Sundeep Kishan,Sundeep Kishan New Movie,Sundeep Kishan Upcoming Movie,Sundeep Kishan Next Project Details,Sundeep Kishan New Movie Details,Sundeep Kishan Latest Film Updates,Sundeep Kishan New Movie News,Sundeep Kishan Next Film,Sundeep Kishan Next Announced,Sundeep Kishan Upcoming Movie Announced,Director Vedavyas,Sundeep Kishan New Movie Launch,Sundeep Kishan Latest Movie Launch

ఒక సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాను లైన్ లో పెడుతూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సందీప్ కిషన్. ఇటీవలే A1 ఎక్స్ ప్రెస్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా మరో సినిమాను ఈ రోజు లాంఛనంగా ప్రారంభించాడు. వేద వ్యాస్‌ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా వైజాగ్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రైటర్‌ కోన వెంకట్‌ క్లాప్‌కొట్టగా, కంకట్ల సిల్క్స్‌ మల్లిక్‌ కెమెరా స్విచ్ ఆన్‌ చేశారు.

ఈ సంద‌ర్భంగా…నిర్మాత మ‌హేశ్ కోనేరు మాట్లాడుతూ “ఈ ఏడాది సంక్రాంతికి మా ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌లో వ‌చ్చిన ‘మాస్ట‌ర్‌’తో మ‌రో సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను సొంతం చేసుకోవ‌డం ఆనందంగా ఉంది. అదే ఉత్సాహంతో ఈరోజు వైజాగ్‌లో కొత్త సినిమాను స్టార్ట్ చేశాం. డిఫ‌రెంట్ మూవీస్ చేయ‌డానికి ప్రాధాన్య‌త ఇచ్చే సందీప్‌కిష‌న్‌తో మ‌రో డిఫ‌రెంట్ మూవీని మా బ్యాన‌ర్‌లో రూపొందించబోతున్నాం. తన పాత్ర చాలా కొత్త‌గా ఉంటుంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుందని తెలిపారు.

ఇక ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 14 =