అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయిన టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అవి నిరాశనే మిగిల్చాయి. ఇక ఈ మధ్య విలన్ పాత్రల్లో కూడా నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఓ డిఫరెంట్ కథతో వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నవీన్ చంద్ర హీరోగా అరవింద్ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది. శర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగు, తమిళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన జవ్వాజి రామాంజనేయులు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈసినిమాను ఈ నెలలోనే గ్రాండ్ గా లాంచ్ చేసి ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు.
కాగా నవీన్‌చంద్ర హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అచ్యుత్ కుమార్, స్మిర్తి వెంకట్, ఎమ్.గోపి, పూజా రామచంద్రన్, సత్యం రాజేష్, సిరి, నవీనా రెడ్డి, సుదర్శన్, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పి.జి ముత్తయ్య సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























